Take a fresh look at your lifestyle.

​కూకట్‌పల్లిలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి: ఆరుగురు అరెస్ట్

ముద్ర కూకట్‌పల్లి :
డబ్బులు పందెంగా కాస్తూ పేకాట ఆడుతున్న ఒక ముఠాను కూకట్‌పల్లి పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుండి భారీగా నగదు మరియు పేకాట ముక్కలను స్వాధీనం చేసుకున్నారు.
పోలీసులకు అందిన నమ్మదగిన సమాచారం మేరకు, కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రగతి నగర్, మూసాపేట్ ప్రాంతంలో కొంతమంది వ్యక్తులు పేకాట ఆడుతున్నట్లు సమాచారం అందింది. ఈ మేరకు పి.సి-10426 వి. నరేందర్ మరియు బృందం సదరు ప్రాంతంపై ఆకస్మిక దాడి నిర్వహించారు.
​ఈ దాడిలో ‘త్రీ కార్డ్ షో’ ఆడుతున్న ఆరుగురు వ్యక్తులను పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
నిందితుల వద్ద నుండి పోలీసులు రూ. 59,310/- నగదు మరియు 6 సెట్ల పేకాట ముక్కలను స్వాధీనం చేసుకున్నారు.
పట్టుబడిన ఆరుగురిపై గేమింగ్ యాక్ట్ సెక్షన్ 3 & 4 (Cr.No. 372/2026) కింద కేసు నమోదు చేసి, తదుపరి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో లేదా రహస్య స్థావరాల్లో జూదం ఆడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా పోలీసులు హెచ్చరించారు

Leave A Reply

Your email address will not be published.