Take a fresh look at your lifestyle.

మిస్కిన్ అహ్మద్ కు జాతీయ అమేజ్ అవార్డు..

నేడు న్యూఢిల్లీలో ప్రధానం…

ముద్ర, సిద్దిపేట సెప్టెంబర్ 21

సిద్దిపేటకు చెందిన ప్రముఖ ఉర్దూ సాహిత్య ప్రేరకులు సయ్యద్ మిస్కిన్ అహ్మద్ జాతీయ ఆమేజ్ అవార్డుకు ఎంపికయ్యారు. న్యూఢిల్లీలోని ఇండియన్ ఇస్లామిక్ కల్చరల్ సెంటర్లో ఈనెల 22న సాయంత్రం 5 గంటలకు ఆయన ఈ పురస్కారాన్ని అందుకుంటారు. ఈ మేరకు అమేజ్ ఫౌండేషన్ డైరెక్టర్ రాఘవేంద్ర ద్వివేది, కన్వీనర్ షాహిద్ అంజుమ్ లు ఆహ్వానంలో ప్రకటించారు. జాతీయస్థాయిలో ఉర్దూ భాష అభివృద్ధికి, సంస్కృతి వికాసానికి మిస్కిన్ అహ్మద్ చేస్తున్న కృషికి గుర్తింపుగా పురస్కారాన్ని ఎంపిక చేసినట్టు తెలిపారు. సిద్దిపేట కు చెందిన మిస్కిన్ అహ్మద్ ప్రతి సంవత్సరం జాతీయ స్థాయిలో ఉర్దూ కవి సమ్మేళనాన్ని , ముసాయిరా లను నిర్వహిస్తున్నారు. పాల్గొన్న కవులను సత్కరిస్తున్నారు. అదేవిధంగా ఉర్దూ కవుల రచనలను వెలుగు లోకి తీసుకురావడానికి అవసరమైన సాయాన్ని అందిస్తున్నారు. సిద్దిపేట మున్సిపల్ వైస్ చైర్మన్ గా పనిచేసిన మిస్కిన్ అన్ని వర్గాలతో కలిసిమెలిసి ఉంటూ ఉర్దూ భాష అభివృద్ధికి విశిష్టమైన కృషి చేస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.