Take a fresh look at your lifestyle.

Bricks Elite Infra : హైదరాబాద్‌లో మరో లగ్జరీ విల్లా ప్రాజెక్ట్.. ప్రకృతి ఒడిలో ప్రశాంతమైన జీవనం

Bricks Elite Infra : హైదరాబాద్‌లో లగ్జరీ విల్లా ప్రాజెక్టులకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ‘‘బ్రిక్స్ ఎలైట్ ఇన్ ఫ్రా’’ Bricks Elite Infra సంస్థ ‘Velora’ పేరుతో ప్రీమియం రెసిడెన్షియల్ కమ్యూనిటీని అభివృద్ధి చేస్తోంది. నగరానికి సమీపంలో ఉన్నప్పటికీ ప్రశాంతమైన, పచ్చదనంతో కూడిన వాతావరణంలో విల్లా జీవనాన్ని అందించడమే ఈ ప్రాజెక్ట్ ప్రధాన ఉద్దేశంగా సంస్థ చెబుతోంది.

7 ఎకరాల్లో.. 69 లగ్జరీ విల్లాలు

Velora ప్రాజెక్ట్ సుమారు 7 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు కానుంది. ఇందులో మొత్తం 69 విల్లాలు ఉండనున్నాయి. ఒక్కో విల్లాకు 238 నుంచి 314 చదరపు గజాల వరకు ప్లాట్ సైజులు అందుబాటులో ఉంటాయని సంస్థ వెల్లడించింది.

ప్రైవసీ, విశాలమైన నివాస ప్రదేశాలు, సహజ కాంతి, ఆధునిక లేఅవుట్‌లకు ప్రాధాన్యం ఇస్తూ విల్లాలను రూపొందిస్తున్నట్లు పేర్కొంది. రోజువారీ జీవితంలో ప్రశాంతత, సౌకర్యం, ప్రకృతికి దగ్గరగా ఉండే అనుభూతిని అందించడమే ప్రాజెక్ట్ కాన్సెప్ట్‌గా కనిపిస్తోంది.

క్లబ్‌హౌస్‌లో ఎన్నో సౌకర్యాలు

Veloraలో నివాసితుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేకమైన క్లబ్‌హౌస్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో మల్టీపర్పస్ హాల్, జిమ్, పార్టీ హాల్, ఇండోర్ గేమ్స్, గెస్ట్ బెడ్‌రూమ్స్, కిడ్స్ పూల్, స్విమ్మింగ్ పూల్ వంటి సౌకర్యాలు ఉంటాయి.

అదనంగా బ్యాడ్మింటన్ కోర్టు, పార్కింగ్‌తో పాటు కార్ లిఫ్ట్ వంటి సదుపాయాలను కూడా ప్రాజెక్ట్‌లో భాగంగా రూపొందిస్తున్నారు.

మసీద్ గడ్డ ఫారెస్ట్‌కు సమీపంలో..

Velora ప్రాజెక్ట్‌కు ప్రధాన ఆకర్షణల్లో లొకేషన్ ఒకటిగా సంస్థ పేర్కొంటోంది. ప్రొటెక్టెడ్ మసీద్ గడ్డ ఫారెస్ట్కు సమీపంలో ఈ ప్రాజెక్ట్ ఉన్నట్లు వెల్లడించింది. దీంతో నగరానికి కనెక్టివిటీతో పాటు పచ్చదనం, ప్రశాంత వాతావరణం అందుబాటులో ఉంటుందని చెబుతోంది.

లొకేషన్ పరంగా తుక్కుగూడ ORR ఎగ్జిట్‌కు సుమారు 5 నిమిషాలు, అంతర్జాతీయ విమానాశ్రయానికి 15 నిమిషాలు, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌కు సుమారు 30 నిమిషాల దూరంలో ఉన్నట్లు ప్రాజెక్ట్ వివరాల్లో పేర్కొన్నారు.

ప్రకృతి.. ప్రైవసీ.. కమ్యూనిటీ

Velora రూపకల్పనలో మూడు అంశాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చినట్లు సంస్థ చెబుతోంది. Sanctuary, Connection, Clarity అనే కాన్సెప్ట్‌ల ఆధారంగా ప్రాజెక్ట్‌ను రూపొందిస్తున్నట్లు పేర్కొంది.

ప్రైవేట్ విల్లాలతో పాటు గ్రీన్ స్పేస్‌లు, రిక్రియేషన్ జోన్లు, కమ్యూనిటీ సదుపాయాలను సమన్వయం చేస్తూ మాస్టర్ ప్లాన్‌ను రూపొందించారు. ప్రైవసీకి భంగం కలగకుండా, అదే సమయంలో కమ్యూనిటీ లైఫ్‌ను ఆస్వాదించేలా వివిధ జోన్లను ప్లాన్ చేసినట్లు సంస్థ తెలిపింది.

ప్రశాంతమైన లగ్జరీ లైఫ్‌స్టైల్‌కు చిరునామాగా..

నగర విస్తరణ వేగంగా జరుగుతున్న సమయంలో.. ట్రాఫిక్, కాలుష్యం, రద్దీకి దూరంగా ఉండే ప్రశాంతమైన నివాస ప్రాంతాలపై ఆసక్తి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో నగరానికి కనెక్టివిటీని కొనసాగిస్తూనే ప్రకృతికి దగ్గరగా ఉండే విల్లా లైఫ్‌ను కోరుకునే వారి కోసం Veloraను రూపొందించినట్లు Bricks Elite Infra చెబుతోంది.

మొత్తంగా చూస్తే.. లగ్జరీ, ప్రకృతి, ప్రైవసీ, ఆధునిక సౌకర్యాలను ఒకే కమ్యూనిటీలో అందించాలనే లక్ష్యంతో Velora ప్రాజెక్ట్‌ను రూపొందించినట్లు తెలుస్తోంది.

పూర్తి వివరాల కోసం కింది లింక్ ను క్లిక్ చేయండి

https://brickseliteinfra.com/

Leave A Reply

Your email address will not be published.