హిందూ ధార్మిక పరిషత్ ఆధ్వర్యంలో ఎంసెట్ ఉచిత శిక్షణ తరగతులు . ముఖ్య అతిథిగా హాజరైన ఆర్బిఎల్ ఎండి బుయ్యని సరళ శ్రీనివాస్ రెడ్డి
ముద్ర, తాండూర్:
మారుతున్న కాలనుగుణంగావిద్యార్థుల్లో నైపుణ్యాన్ని పెంపొందిచుకొని పోటీ పరీక్షలకు సన్నద్ధం కావాలని ఆర్బిఎల్ ఎండి బుయ్యని సరళ శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణంలోని సిద్ధార్థ జూనియర్ కళాశాలలో హిందూ ధార్మిక పరిషత్ ఆధ్వర్యంలో ఎంసెట్ ఉచిత శిక్షణ తరగతులను ప్రారంభించారు. ఇట్టి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆర్బిఎల్ ఎండి బుయ్యని సరళ శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గురువుల మార్గదర్శకత్వంలో నిర్దిష్ట ప్రణాళికను రూపొందించుకొని పోటీ పరీక్షలకు సిద్ధం కావాలని ఆమె కోరారు. పరీక్షల్లో మార్కులు ముఖ్యం కాదని ఏకాగ్రతతో కూడిన జ్ఞానాన్ని సంపాదించుకునేలా చదవాలని ఆమె తెలిపారు. హిందూ ధార్మిక పరిషత్ యొక్క సేవలను ఆమె కొనియాడారు. ఆర్ బి ఓ ఎల్ తరపున విద్యార్థిని విద్యార్థులకు తన వంతు చేయూతనందించేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని ఆమె భరోసరించారు. కార్యక్రమంలో హిందూ ధార్మిక పరిషత్ గౌరవ అధ్యక్షులు కరణం పురుషోత్తం రావు, తాండూర్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ టి నరేందర్ సార్, ఎంసెట్ కోచింగ్ కన్వీనర్ పర్యాద రామకృష్ణ, హిందూ ధార్మిక పరిషత్ సభ్యులు ఓం ప్రకాష్ సోమని, వినోద్ జైన్, పటెల్ విజయ్ కుమార్, జయంత్, అధ్యాపక బృందం, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.