కోరుట్ల, ముద్ర;
కోరుట్ల పట్టణంలోని కల్లూరు రోడ్ లో గల ప్రాథమిక పాఠశాల క్యాంప్ గడి(యస్ ఆర్ ఎస్ పి) కోరుట్లలో పాఠశాల వార్షికోత్సవం బుధవారం ఉదయం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా జిల్లా విద్యాశాఖాధికారి కె. రాము పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు, తల్లిదండ్రులు గడి పాఠశాల ప్రగతిలో ముఖ్యమైన స్థానముందని, ప్రభుత్వం అందిస్తున్న ఉచిత మధ్యాహ్న భోజనం, పుస్తకాలు, దుస్తులు వంటి అంశాలను కొనియాడారు. రాబోయే విద్య సంవత్సరంలో కొత్త మెనూ ప్రకారం భోజనం రుచికరంగా ఉండేందుకు చర్యలు ఉంటాయని అన్నారు. బడి బాట కార్యక్రమంలో కొత్త విద్యార్థులను ఎక్కువగా నమోదు చేయాలని కోరారు. రాబోయే విద్య సంవత్సరం కొరకు బడి బాట కరపత్రాన్ని ఆవిష్కరణ చేశారు. ఈ వేడుకలో విద్యార్థులు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు నునావత్ రాజు, మున్సిపల్ చైర్మన్ తిరుమల వసంత గంగాధర్, మున్సిపల్ కమిషనర్ జి. రవీందర్, మండల విద్యాధికారి జి. నరేశం, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ పి. మంగ, విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.