Take a fresh look at your lifestyle.

రూ. 1.83 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన కేజీబీవీ విద్యార్థులతో ఎమ్మెల్యే ఏలేటి భోజనం

 

ముద్ర ప్రతినిధి, నిర్మల్:
నిర్మల్ జిల్లా లక్ష్మణ చాంద మండల కేంద్రంలో రూ. 1.83 కోట్ల విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలకు నిర్మల్ ఎంఎల్ఏ ఏలేటి మహేశ్వర్ రెడ్డి శనివారం శంకుస్థాపన చేశారు. ఇందులో భాగంగా రూ.40 లక్షలతో నిర్మించే నాలుగుస్వాయం సహాయక బృందాల భవన నిర్మాణానికి, రూ. 40 లక్షలతో వర్కింగ్ షెడ్ ల నిర్మాణానికి, రూ.60 లక్షలతో 5 అంగన్వాడీ భవనాల నిర్మాణానికి, రూ. 10 లక్షలతో కె జి బి వి పాఠశాల ప్రహరీ గోడ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అలాగే రూ.30 లక్షలు వ్యయమయ్యే ధాన్యం నిలువ గోదాం, రూ. 3లక్షల మాదిగ సంఘ భవన నిర్మాణానికి బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం మండల కేంద్రంలోని కేజీబీవీ స్కూల్ ను పరిశీలించారు. పాఠశాలలో విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. పాఠశాలకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నల్ల ఇంద్రకరణ్ రెడ్డి, సీనియర్ నాయకులు రావుల రాంనాథ్, మండల అధ్యక్షులు చిన్నయ్య, గ్రామ సర్పంచ్ ఓస కవిత రాజు, మాజీ ఎంపీపీ అడ్వాల రమేష్ , మాజీ సర్పంచ్ ముత్యం రెడ్డి, ఉపసర్పంచ్ వర్ష రవి, నాయకులు రంజిత్, సురేష్, రవి, పోశెట్టి,తో పాటు మండల బీజేపీ నాయకులు కార్యకర్తలు, జిల్లా మండల అధికారులు, గ్రామ ప్రజలు, మహిళా సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.