Take a fresh look at your lifestyle.

మధ్యాహ్న భోజనం లో నాణ్యత పెంచండి- జిల్లా కలెక్టర్ హైమావతి

 

సిద్దిపేట, ముద్ర ప్రతినిధి :

సిద్దిపేట జిల్లా నంగునూరు మండలంలోని నర్మేట గ్రామంలో గల కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని సిద్దిపేట జిల్లా కలెక్టర్ హైమావతి ఆకస్మికంగా సందర్శించి మధ్యాహ్న భోజన పక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
అన్నం, చిక్కుడుకాయ, టమాట పప్పు, రసం, పెరుగు లను పరిశీలించారు. టమాట పప్పు నాణ్యత మెరుగుపరచాలని కామన్ డైట్ మెనూ తప్పనిసరిగా పాటించాలని వండిన ప్రతి వంటకం రుచికరంగా ఉండి విద్యార్థులకు కడుపునిండా తినే విధంగా ఆహారం వండాలని ఎస్ఓ కు సూచించారు. రోజు విద్యార్థుల హాజరు ప్రకారం వంట సరుకులు అందించాలని భోజనం వసతి చదువు విషయంలో రాజి పడవద్దని విద్యార్థులకు ఎలాంటి లోటుపాట్లు కలగకుండా చూసుకోవాలని ఎస్ ఓ ను ఆదేశించారు.

Leave A Reply

Your email address will not be published.