ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి :
లిటిల్ ఎల్లి పాఠశాలలో సైన్స్ ఎగ్జిబిషన్‌ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఎంతో ఉత్సాహంతో పాల్గొని, వివిధ శాస్త్రీయ అంశాలపై ఆధారపడి సృజనాత్మకమైన, ఆలోచనాత్మకమైన మోడళ్లను రూపొందించారు. విద్యార్థులు తమ మోడళ్లకు సంబంధించిన వివరాలను ఆత్మవిశ్వాసంతో స్పష్టంగా వివరించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఈ సైన్స్ ఎగ్జిబిషన్ విజయవంతంగా జరగడానికి డైరెక్టర్ బస్వరాజ్ గౌడ్ మార్గదర్శనం, ప్రిన్సిపల్ సిర్గా రావలి ప్రోత్సాహం ఎంతో దోహదపడింది. అలాగే ఉపాధ్యాయులు మరియు సిబ్బంది అందరూ సమన్వయంతో పనిచేసి ఈ కార్యక్రమాన్ని ఘన విజయంగా మలిచారు. ఈ ఎగ్జిబిషన్ విద్యార్థుల్లో శాస్త్రంపై ఆసక్తిని పెంపొందించి, వారి సృజనాత్మకతను వెలికి తీసే వేదికగా నిలిచింది.