Take a fresh look at your lifestyle.

పంచాయతీ కార్మికుల సమ్మెను విజయవంతం చేయాలి

  • సీఐటీయు మండల కన్వీనర్ పోచమోని కృష్ణ.
  • దేశవ్యాప్త సమ్మె గోడపత్రికల విడుదల.

ఇబ్రహీంపట్నం, ముద్ర విలేకరి: వివిధ రంగాల్లో పనిచేస్తున్న కార్మికుల సమస్యల పరిష్కారం కోసం సీఐటీయు ఆధ్వర్యంలో తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని సీఐటీయు మండల కన్వీనర్ పోచమోని కృష్ణ పిలుపునిచ్చారు.ఈ నెల 20న నిర్వహించ తలపెట్టిన పంచాయతీ కార్మికులకు సమ్మె గోడ పత్రికను కార్మిక సంఘాల నేతలతో కలిసి మంచాల మండల కేంద్రంలో మంగళవారం విడుదల చేశారు.ఈ సందర్భంగా పోచమోని కృష్ణ మాట్లాడుతూ ఎన్నో పోరాటాల ద్వారా సాధించుకున్న కార్మికుల చట్టాలను కాలరాస్తూ కేంద్ర ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్ లను తెస్తోందని విమర్శించారు. కార్మికులు, కర్షకులు ఉద్యమాలు చేసి ఎనిమిది గంటల పని దినాన్ని సాధించుకుంటే కేంద్ర ప్రభుత్వం దానికి విరుద్ధంగా చట్టాలు తీసుకొచ్చి యజమానులకు అనుకూలంగా చట్టాలను మారుస్తున్నారని అన్నారు. కనీస వేతనం రూ. 26 వేలు ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పిస్తే పాలక ప్రభుత్వాలు దానిని అమలు చేయడం లేదని విమర్శించారు.సీఐటీయు ఆధ్వర్యంలో తలపెట్టిన సమ్మెలో గ్రామ పంచాయతీ, అంగన్వాడి, ఆశ, మధ్యాహ్న భోజన పథకం కార్మికులతో పాటు ఇతర రంగాల కార్మికులు పాల్గొనాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ యూనియన్ నాయకులు జగన్, ఆశ వర్కర్స్ యూనియన్ నాయకులు అమృత, సంతోష, పారిజాత, ప్రియాంక, స్వరూప, అంగన్వాడి టీచర్లు ఐలమ్మ, సుశీల, ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ల యూనియన్ నాయకులు కుమారస్వామి, గ్రామ పంచాయతీ కార్మికులు మహేష్ , బీరప్ప, రాములమ్మ, రజిత, నవనీత, సంతోష, అలివేలు, అమృత, జ్యోతి, యాదమ్మ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.