ముద్ర ప్రతినిధి, మెదక్:
జిల్లా కేంద్రం పిల్లి కొట్టాల్ శివారులో గల నర్సింగ్ కళాశాలను మున్సిపల్ ఛైర్ పర్సన్ కానుగు రాధిక భూపతిరాజ్ ఆదివారం సందర్శించారు. కళాశాలలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి తక్షణమే చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే రోహిత రావు ఆదేశించారని గుర్తు చేశారు. ఎమ్మెల్యే సూచనతో కళాశాల సందర్శించినట్లు తెలిపారు. విద్యార్ధినీలు ఎదుర్కొంటున్న సమస్యలను విని నివేదిక సిద్ధం చేశారు. నర్సింగ్ కళాశాల ఆవరణలో గల అపరిశుభ్రత వాతావరణం, వంటగదిలో ఉన్న సామాగ్రి నిలువలను అక్కడే ఉన్న సిబ్బందితో అడిగి తెలుసుకున్నారు. కళాశాలలో నెలకొన్న పరిస్థితిని ఎమ్మెల్యే రోహిత్ రావుక దృష్టికి ఫోన్ ద్వారా తెలిపారు. సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకుంటున్నట్లు చైర్ పర్సన్ తెలిపారు. విద్యార్థినీలను ఇబ్బందులకు గురిచేస్తూ ఆపరిశుభ్ర వాతావరణంలో, కుళ్లిన పదార్థాలతో వంటలు చేసి భోజనం పెట్టడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంట కాంగ్రెస్ నాయకులు కానుగు భూపతిరాజ్, నర్సింగ్ కళాశాల సిబ్బంది ఉన్నారు.