Take a fresh look at your lifestyle.

సామాజిక వేనకబాటుకు గురి అవుతున్న వర్గాలకు రిజర్వేషన్లు కల్పించడం కాంగ్రెస్ పార్టీ విధానం

  • డెడికేటెడ్ కమిషన్ వేయకుండా రిజర్వేషన్ కుదించడం పై బీ ఆర్ ఎస్ పార్టీ బాధ్యత వహించాలి.
  • మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి.

ముద్ర ప్రతినిధి, జగిత్యాల : సామాజిక వేనకబాటుకు గురి అవుతున్న వర్గాలకు రిజర్వేషన్లు కల్పించడం కాంగ్రెస్ పార్టీ విధానమని మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి పేర్కొన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో మాజీ మంత్రి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాజ్యంగంలో దళితులు, గిరిజనలకు జనాభా ప్రాతిపదిక నా నిర్దేశినట్లుగా బలహీన వర్గాల ప్రజలకు రిజర్వేషన్లు కల్పించాలని రాజ్యాంగం లో స్పష్టంగా పేర్కొన్నారు.ఇంపీరియల్ డాటా ద్వార రిజర్వేషన్ పొందే వారినీ గుర్తించాలని, సామాజిక వెనకబాటు తనం గురి అవుతున్న వర్గాలను వారీ జనాభాకు అనుగుణగం డెడికేటెడ్ కమిషన్ ద్వారా నిర్ధారించాలని కోర్టు నిర్దేశించిందని తెలిపారు. రిజర్వేషన్లు 50 శాతం మించకూడదు అని అనేది కూడా ఒక అంశం, ఉమ్మడి రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ 34 శాతం అమలు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లతో కలిపి రిజర్వేషన్లు 50 శాతం మించుతున్నాయని అప్పటి బీ ఆర్ ఎస్ ప్రభుత్వం రివేషన్లు 23 శాతానికి కుదించింది. డెడికేటెడ్ కమిషన్ వేయకుండా రిజర్వేషన్ కుదించడం పై బీ ఆర్ ఎస్ పార్టీ బాధ్యత వహించాలన్నారు. బీ ఆర్ ఎస్ ప్రభుత్వం వచ్చే స్థానిక ఎన్నికల్లో డెడికేషన్ కమిషన్ ద్వారా సామాజిక వెనకబాటు గురి అవుతున్న వారిని గుర్తించి, రిజర్వేషన్లు అమలు చేస్తామని నివేదిక ఇచ్చారు. రిజర్వేషన్ అమలు చేసేందుకు ఏవిధమైన చర్యలు చేపట్టకుండా నిర్లక్ష్యం చేసింది. సకాలంలో అమలు చేస్తే ఈ సమస్య వచ్చేది కాదన్నారు. సాంకేతిక సమస్యలు ఎదురుకాకుండా డెడికేటెడ్ కమిషన్ సామాజిక వెనకబాటు గురి అవుతున్న వారు 56 శాతం గా పేర్కొనగా 42 శాతం రిజర్వేషన్ అమలు చేసేందుకు శాసన సభ, శాసన మండలి లో ఆమోదం తెలిపి,గవర్నర్ పరిశీలించి నివేదిక రాష్ట్రపతికి పంపారు. మూడు నెలలు అవుతున్న రాష్ట్రపతి ఎటువంటి నిర్ణయం ప్రకటించలేదు. ఏ బిల్లు అయిన రాష్ట్రపతి మూడు మాసాల్లో నిర్ణయం తీసుకోకుంటే అమలు చేసినట్లే అని సుప్రీమ్ కోర్టు తీర్పు ఇచ్చిందని, రిజర్వేషన్లు షెడ్యూల్ లో 9లో చేర్చబడితే చట్టబద్దత వస్తుందని, రాష్ట్ర శాసన సభ, శాసన మండలి లో బీజేపీ మద్దతు తెలిపి,9 వ షెడ్యూల్ లో చేర్చేందుకు కేంద్ర ప్రభుత్వం చొరవ చూపడం లేదన్నారు. న్యాయ పరమైన సమస్యలు తలెత్తకుండా షెడ్యూల్ 9లో చేర్చాలి ఉండగా, కేంద్ర ప్రభుత్వం తన బాధ్యత విస్మరించిందని, రాష్ట్రంలో రిజర్వేషన్ అమలు బిల్లు కు బీజేపీ మద్దతు తెలిపి జాతీయ ఓబీసీ నాయకులు 42 శాతం రిజర్వేషన్ బిల్లు రాష్ట్రపతి వద్ద ఉండగా ఆర్డినెన్సు ఎలా తీసుకు వస్తారంటూ ప్రశ్నిస్తుండడం విడ్డూరంగా ఉందన్నారు. బీఆర్ ఎస్ డెడికేషన్ కమిషన్ వేయకుండా నిర్లక్యం చేయడం తో కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత తో సామాజిక వెనకబాటు కు గురి అయిన వారి హక్కులు కల్పించేందుకు చొరవ తీసుకుంది..సెప్టెంబర్ చివరి నాటికి ఎన్నికలు నిర్వహించాలని హై కోర్టు నిర్దేశించింది. స్థానిక సంస్థల ఎన్నికల జాప్యం తో కేంద్రం నుండి రావాల్సిన నిధులు పొందలేకపోతున్నాం. సామాజిక న్యాయం కల్పించేందుకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి, సామాజిక వెనకబాటుకు గురి అవుతున్న వారికి హక్కులు కల్పించాలి అని సంకల్పంతో అన్ని రాజకీయ పార్టీలతో చర్చించి, రాష్ట్ర ప్రభుత్వం బిల్లు రాష్ట్రపతికి నివేదించింది. 42 శాతం స్థానిక సంస్థల్లోనే కాదు విద్యా, ఉద్యోగాల్లో కూడా 42 శాతం అమలు చేస్తామని తెలిపారు. బలహీన వర్గాల ప్రజలు 42 శాతానికి అదనంగా మరో 16 శాతం పొందే అవకాశం ఉంది. 33 శాతం ఓపెన్ కేటగిరీ లో కూడా బీసీ లు కూడా పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. బీసీ లకు 42 శాతం రిజర్వేషన్స్ అమలు కోసం కాంగ్రెస్ పార్టీ సంకల్పంతో పని చేస్తుండగా ఎక్కడ కాంగ్రెస్ కు పేరు వస్తుందో అని విమర్శించడం దురదృష్టకరమన్నారు. ఈ డబ్ల్యు ఎస్ కోసం రాజ్యాంగం సవరణ చేసినట్టు, బీజేపీ బలహీన వర్గాలకు రిజర్వేషన్స్ అమలుకు నిర్లక్యం ఎందుకు..రాజ్యాంగ నిబంధనలను అనుగుణంగా డా.అంబేద్కర్ దూరదృష్టి తో చేపట్టిన రిజర్వేషన్ల అమలుతో సామాజిక న్యాయం సాధ్యం. రిజర్వేషన్ బాలు బీజేపీ కోర్టు లో ఉంది. 9 వ షెడ్యూల్ లో చేర్చాల్సిన బాధ్యత బీజేపీ పై ఉంది. బీజేపీ 9 వ షెడ్యూల్ చేర్చకపోవడంతో ప్రత్యామ్నాయ మార్గముగా ఆర్డినెన్సు కు తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్ళాల్సి వస్తుంది. ఆర్డినేస్ తీసుకురావడానికి బీజేపీయే కారణం అని అన్నారు.బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు రాజకీయం చేసే ప్రయత్నం చేయకుండా,సామాజికంగా వెనకబాటుతనానికి గురి అవుతున్న వారికి సామాజిక న్యాయం కల్పించేలా అందరూ సహకరించాలి జీవన్ రెడ్డి కోరారు.

Leave A Reply

Your email address will not be published.