Take a fresh look at your lifestyle.

ఘనంగా ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ సతీమణి జన్మదిన వేడుకలు

ముద్ర, ధర్మపురి: ప్రభుత్వ విప్ ధర్మపురి ఎమ్మెల్యే అట్లూరి అట్లూరి లక్ష్మణ్ కుమార్ సతీమణి కాంత కుమారి జన్మదిన వేడుకలను ధర్మపురి క్యాంప్ ఆఫీస్ లో బుధవారం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా లక్ష్మణ్ కుమార్ దంపతులకు పూలమాలలు వేసి శాలువాలతో ఘనంగా సన్మానించారు. కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసుకున్నారు. ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మునుముందు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ కాంగ్రెస్ శ్రేణులు పుష్ప గుచ్చాలు అందించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

అనంతరం కాంత కుమారి జన్మదినంను పురస్కరించుకొని అన్నదానం నిర్వహించారు. లక్ష్మణ్ కుమార్ కు మద్దతుగా ధర్మపురి నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి కాకుండా జగిత్యాల జిల్లా నలుమూలల నుంచి అభిమానులు, కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు . ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ శ్రేణులు అభిమానులు నాయకులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.