Take a fresh look at your lifestyle.

గాలి వాన బీభత్సం

  • విరిగిన విద్యుత్ స్తంబాలు చెట్లు.
  • రేగొండ మండలంలో విద్యుతకు అంతరాయం.

ముద్ర ప్రతినిధి, భూపాలపల్లి: గాలివాన బుధవారం సాయంత్రం బీభత్సం సృష్టించింది.భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా గణపూరం, రేగొండ మండలాల్లో అతలాకుతలమైంది.ఈదురు గాలులు వీచి భారీ వృక్షలు, విద్యుత్ స్తంబాలు ఎగిరిపోయాయి.రేగొండ మండలంలో సుమారు పదుల సంఖ్యలో చెట్లు విరిగి పడ్డాయి. విద్యుత్ స్తంబాలు దెబ్బతిన్నాయి. మండలంలోని పాండవుల గుట్ట, కొత్తపల్లి, నారాయణ పూర్, రేగొండ, మండల కేంద్రాల్లో భారీ వృక్షలు ఊరిగి విద్యుత్‌ స్తంభాలపై పలు కాలనీల్లో విద్యుత్‌ స్తంభాలు నేలకూలి విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఏర్పడింది.మండల వ్యాప్తంగా శనివారం ఈదురుగాలులతో కూడిన జల్లులు కురవడంతో రైతులు అతలాకుతలం అయ్యారు. ఉదయం నుంచి తీవ్రమైన ఎండ ఉండగా, సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం చల్లబడి అకస్మాత్తుగా ఈదురుగాలులు ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు కురవడంతో రైతులు ఆరబోసిన ధాన్యాన్ని తడవకుండా పరదాలు కప్పారు. కాగా ఒక్కసారిగా అకాల వర్షం వల్ల రైతులు ఆందోళన చెందుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.