Take a fresh look at your lifestyle.

గడువు లోపు అభ్యంతరాలు తెలుపాలి: కమిషనర్ గద్దె రాజు

రామకృష్ణాపూర్, ముద్ర విలేకరి : డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల అర్హుల లిస్టులో అభ్యంతరాలను లిఖితపూర్వకంగా సమర్పించాలని మున్సిపల్ కమిషనర్ గద్దె రాజు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.పంపిణీకి సిద్దంగా ఉన్న 236 ఇండ్లకు 285 మందిని ఎంపిక చేసి లక్కీ డ్రా పద్ధతి ద్వారా ఇండ్లను కేటాయిస్తామని తెలిపారు. మే 1 నుంచి 7 వరకు అర్హుల లిస్టుపై అభ్యంతరాలు తెలిపేందుకు ప్రజలకు గడువు ఇచ్చినట్లు ప్రకటించారు.ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించేందుకు మున్సిపల్ కార్యాలయంలో ప్రత్యేక హెల్ప్ డెస్క్ కౌంటర్లను ఏర్పాటు చేశారు.కాగా అర్హుల లిస్టులో పేర్లను వివిధ వార్డుల ప్రజలు పరిశీలిస్తున్నారు. అర్హులైన వారి పేర్లు లేకపోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.అర్హుల లిస్టులో అవకతవకలు జరిగినట్లుగా పలువురు ఆరోపిస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.