ముద్ర,మోత్కూరు:
గురుకుల పాఠశాలలో ప్రమాణాల మెరుగుపరిచేందుకు అన్ని రకాల చర్యలు చేపట్టనున్నట్లు కలెక్టర్ అనురాగ్ జయంతి తెలిపారు. శనివారం మోత్కూరు లోని ఎస్సీ బాలుర పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి వంట గదులకు వెళ్లి వంటలను స్వయంగా పరిశీలించి విద్యార్థులకు లోటు పాట్లు జరగకుండా నాణ్యమైన భోజనం అందించాలని ప్రిన్సిపాల్ ను ఆదేశించారు.పాఠశాలలో కలియ తిరిగి విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. పాఠశాలలో మౌళిక వసతులను పరిశీలించి విద్యార్థులను ఆరా తీశారు.అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.ఈ సందర్భంగా విద్యార్థులను ఏం చదువుతున్నారు భోజనం బాగుందా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన భోజనం,శుద్ధమైన త్రాగునీరు వసతులను మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ జ్యోతి, ఎంపీడీఓ బాలాజీ, ఎంపీఓ జనార్దన్ రెడ్డి మున్సిపల్ కమీషనర్ కే సతీష్ కుమార్ గురుకుల గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ ఎం.స్వామి తదితరులు పాల్గొన్నారు.