బడ్జెట్ సమావేశం లోనే నిధులు కేటాయిస్తూ నిర్ణయం చేయాలి
జీతాలు పెంచకపోతే మంత్రులు ఎమ్మెల్యేల ఇండ్లను ముట్టడిస్తాం
సిఐటియు రాష్ట్ర కార్యదర్శి గోపాలస్వామి
సిద్దిపేట జిల్లాలో ఆశాల కలెక్టరేట్ ఉద్రిక్తత
ముద్ర ప్రతినిధి, సిద్దిపేట :
బడ్జెట్ సమావేశంలోనే ఆశా వర్కర్లకి ఫిక్స్డ్ వేతనం 18 వేల రూపాయలు నిర్ణయం చేయాలని లేకుంటే మంత్రులు ఎమ్మెల్యేలు ముట్టడిస్తామని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కాముని గోపాల్ హేచ్చరించారు.

మంగళవారం ఆశ కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం నిర్వహించిన అనంతరం ర్యాలీగా కలెక్టరేట్ భారీగేటులను తోసుకొని వెళ్లారు. ఈ సందర్భంగా కొంత ఉద్రిక్తత పరిస్థితులకు దారి తీసింది. పోలీసులు జోక్యం చేసుకొని ఆశా కార్యకర్తలకు అధికారులు పిలిపిస్తామని సర్ది చెప్పడంతో కొంత ఆందోళన విరమించారు. అనంతరం కలెక్టరేట్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ గేటు బయటకు వచ్చి సిఐటియు నాయకులతో చర్చించారు.

ఆశా లీడర్స్ ఎటు నాయకత్వంతో అధికారులతో కలిపి జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేసి తమ పరిధిలో ఉన్న సమస్యలను సత్వరమే పరిష్కారం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన కార్యక్రమాన్ని విరమించారు. ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర కార్యదర్శి గోపాల స్వామి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆశా వర్కర్లకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం ఈ బడ్జెట్ సమావేశంలోనే 18 వేల రూపాయలు ఫిక్స్డ్ వేతనం నిర్ణయం చేయాలని, పి ఎఫ్ ఎస్ ఐ సౌకర్యాలతో పాటు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని రిటైర్మెంట్ బెనిఫిట్ సౌకర్యం కల్పించాలని కోరారు. అలాగే జనాభా ప్రాతిపాదికన ఆశా వర్కర్ల కేటాయింపులు ఉన్నప్పటికీ మండల కేంద్రాలలో పట్టణ కేంద్రాలలో ఉంటున్నటువంటి ఆశ వర్కర్లకు ఎక్కువ మంది జనాభా కు ఒకరు ఆశ వర్కర్ వింటున్నారని దీని ఫలితంగా ఆశా వర్కర్లకి వర్క్ లోడ్ ఎక్కువ అవుతుందని ఇలాంటి స్థానిక సంస్థలు కూడా అనేక ఉన్నాయని ఇప్పటికే ఆశ వర్కర్లపై అధికారులు, కింది స్థాయి ఉద్యోగులు వేధింపులకు గురి చేస్తున్నారని వీటిని వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి వేతనాలు పెంచకపోతే సమస్యలు పరిష్కారం చేయకపోతే రాష్ట్రంలో మంత్రుల ఇండ్లను ఎమ్మెల్యేలు ముట్టడిస్తామని ఈ సందర్భంగా ఆయన చరించారు. ఈ ధర్నా కు సంఘీభావం ప్రకటించి మద్దతుగా మాట్లాడిన సిపిఎం సిద్దిపేట జిల్లా కార్మిక సభ్యులు రాళ్ల బండి శశిధర్ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు సందబోయిన ఎల్లయ్య జిల్లా కోశాధికారి గొడ్డు బర్ల భాస్కర్ జిల్లా సహాయ కార్యదర్శి చొప్పరి రవికుమార్, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు బత్తుల అభిషేక్ బాన్ ఆశా యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు భూలక్ష్మి, ప్రవీణ కోశాధికారి భాగ్యలక్ష్మి ఆశా వర్కర్లు బాలమణి భాగ్య శ్రీలత అంజలి రమ కమల లక్ష్మి వాణి అరుణ తదితరులు పాల్గొన్నారు.