Take a fresh look at your lifestyle.

గోల్కొండ బోనాలకు భారీగా ఏర్పాట్లు

  • బోనాల నిర్వహణతో రాష్ట్ర ఖ్యాతి విశ్వవ్యాప్తం కావాలి.
  • అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలి.
  • గోల్కొండ బోనాలను విజయవంతం చేయాలి.
  • ఈనెల 26 నుంచి నెల రోజుల పాటు ఆషాఢ మాస బోనాలు.
  • భక్తులకు అసౌకర్యం లేకుండా ఏర్పాట్లు చేయాలి.
  • ఇప్పటికే ఉత్సవాల నిర్వహణకు నిధుల కేటాయింపు.
  • అధికారులతో సమీక్షలో మంత్రి పొన్నం ప్రభాకర్.​

ముద్ర, తెలంగాణ బ్యూరో : ఆషాడ బోనాల ఉత్సవాలతో తెలంగాణ ఖ్యాతి విశ్వవ్యాప్తం కావాలని హైదరాబాద్​ ఇన్​ ఛార్జీ మంత్రి పొన్నం ప్రభాకర్​ ఆకాంక్షించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించతలపెట్టిన గోల్కొండ బోనాలను అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేసి విజయవంతం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ నెల 26 నుంచి గోల్కొండ, ఆషాడ మాసం బోనాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో మంగళవారం గోల్కొండ కోట ఆవరణలో పోలీస్, రెవెన్యూ, ఆర్ అండ్ బి, విద్యుత్, దేవాదాయ, వైద్య ఆరోగ్య, జిహెచ్ఎంసి, అగ్నిమాపక, టూరిజం, సమాచార శాఖ అధికారులతో శ్రీ జగదాంబ మహంకాళి దేవస్థానంలో బోనాల కార్యక్రమం ఏర్పాట్లపై నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బోనాల ఉత్సవాల సందర్భంగా ప్రజలకు,భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రతిష్ట ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు నిరంతర పర్యవేక్షణ, చేయాలని, ఆర్ అండ్ బి భక్తులకు ఇబ్బందిగా కలగకుండా బారీ గేట్స్, టాయిలెట్స్ ఏర్పాటు చేయాలని, రెప్ప పాటు కూడా కరెంటు పోకుండా నిరంతరం విద్యుత్ శాఖ విద్యుత్ ను సరఫరా చేయాలని, రెవెన్యూ శాఖ ఏర్పాట్లను పర్యవేక్షించాలని, బోనాలు ప్రశాంతంగా జరిగేలా అన్ని శాఖలు సమన్వయంతో సేవాభావంతో పనిచేయాలని సూచించారు. చాలా సంవత్సరాలు గా హైదరాబాద్ షాన్ గా గోల్కొండ నుంచి తొలి బోనం.. జూన్ 26న ప్రారంభం అవుతుందన్నారు.ఈ నేపథ్యంలో ఎలాంటి లోటుపాట్లు, భక్తులకు అసౌకర్యం కలగకుండా ఉత్సవాలు జరుపుకోవాలన్నారు.అధికారుల బాధ్యత గా ఉంటూ అమ్మవారికి సేవ చేసుకునే అవకాశం దొరికిందని బాధ్యత గా నిమగ్నమై పని చేయాలన్నారు. ఇప్పటికే బోనాల ఉత్సవాలకు ప్రభుత్వం రూ.20కోట్లు కేటాయించిందన్నారు.ప్రముఖ దేవాలయాలకు ప్రముఖులు పట్టు వస్త్రాలు సమర్పిస్తారన్నారు.అమ్మ దయతో తెలంగాణలో సమృద్ధి వర్షాలతో పాడి పంటలతో మంచి వ్యాపారాలతో అంతా మంచి జరగాలని వేడుకొందామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పర్యాటకులు తొలి బోనం గోల్కొండ లో జరిగే ఉత్సవాలు పాల్గొనేలా చేయాలన్నారు.ప్రపంచ సాంకేతికత పెరిగిన ఆషాఢ మాస బోనం నెత్తిమీద పెట్టుకొని వస్తున్నామని చెప్పారు.పోలీస్ లు ఎక్కడ ఇబ్బందులు లేకుండా భద్రత చర్యలు చేపట్టాలని,కోట కింద భక్తుల క్యూ ఎక్కువగా ఉంటుందని బారికేడ్లు ఏర్పాటు చేసి జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. జీహెచ్ఎంసీ శానిటేషన్ సిబ్బంది ఉండేలా చూసుకోవాలి, తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేయాలని,నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని,అదనంగా జనరేటర్లు ఏర్పాటు చేయాలన్నారు.హెల్త్ క్యాంప్ లు, అంబులెన్స్ లు ఏర్పాటు,షి టీమ్ లు ఏర్పాటు చేసి మహిళలకు ఇబ్బందులు లేకుండా పర్యవేక్షణ చేయాలన్నారు. అగ్నిప్రమాదాలు జరగకుండా అగ్ని మాపక శాఖ అప్రమత్తంగా ఉండి, అగ్నిమాపక వాహనాలు సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. గోల్కొండ కు ఆర్టీసి హైదరాబాద్ లోని పలు బస్ స్టాప్ ల నుండి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను మంత్రి ఆదేశించారు. మహిళలకు ఉచితంగా బస్సులు ఉన్న నేపథ్యంలో ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉందన్నారు.సమాచార ప్రసార శాఖ ఉత్సవాలను ప్రత్యక్ష ప్రసారం చేస్తుందన్నారు. దానికి సాంస్కృతిక శాఖతో సమన్వయం చేసుకోవాలని మంత్రి సూచించారు. పర్యాటకశాఖ నుంచి హరిత హోటల్ లు, లేక్స్ టూరిజం స్పాట్ల వివరాలను ప్రదర్శించాలన్నారు.ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, శాసనసభ్యులు కౌసర్ మొహియోద్దీన్, మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి,జిల్లా కలెక్టర్ హరి చందన దాసరి, అదనపు కలెక్టర్ జి ముకుంద రెడ్డి, డీసీపీ చంద్రశేఖర్, వివిధ దేవాలయ చైర్మన్లు జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.