Take a fresh look at your lifestyle.

పారిశ్రామిక అభివృద్ధి తోనే ఉపాధి అవకాశాలు- ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి

 

ముద్ర : కాప్రా

పారిశ్రామిక అభివృద్ధితోనే ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి తెలిపారు.చర్లపల్లి ఇండస్ట్రీస్ అసోసియేషన్ కార్యాలయ సముదాయంలో నిర్వహించిన ఎం ఎస్ ఎం ఈ ఎక్స్‌పో–2026 ను సోమవారం ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ప్రారంభించారు .
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ఎక్స్‌పో లోని వివిధ పారిశ్రామిక స్టాళ్లను సందర్శించారు. స్థానిక పరిశ్రమల అభివృద్ధి, చిన్న , మధ్య తరహా పరిశ్రమలకు ప్రోత్సాహం కల్పించే కార్యక్రమాలు ఎంతో అవసరమని ఆయన పేర్కొన్నారు. పరిశ్రమలు అభివృద్ధి చెందితే ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, ప్రాంతీయ ఆర్థికాభివృద్ధికి ఇది ఎంతో దోహదపడుతుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో టీఐఎఫ్ అధ్యక్షులు కె. సుధీర్ రెడ్డి , చెర్లపల్లి ఇండస్ట్రీస్ అసోసియేషన్ అధ్యక్షులు డి. శ్రీనివాస రెడ్డి , కార్యదర్శి పీ.ఎస్. మోహన్ తదితరులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు సోమ శేఖర్ రెడ్డి, మహిపాల్ రెడ్డి పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు, సంఘ సభ్యులు , స్థానిక ప్రముఖులు ఈ ఎక్స్‌పోలో పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

Leave A Reply

Your email address will not be published.