Take a fresh look at your lifestyle.

కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్ని రంగాలలో మహిళలకు పెద్దపీట – మాజీ కార్పొరేటర్ రజితపరమేశ్వర్ రెడ్డి

 

ముద్ర : కాప్రా

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక సీఎం రేవంత్ రెడ్డి అన్ని రంగాలలో మహిళలకు పెద్దపీట వేస్తున్నారని ఉప్పల్ మాజీ కార్పొరేటర్ మందుముల రజితపరమేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు.
మహిళలకు మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సుమారు 50 శాతం వరకు రిజర్వేషన్లు కల్పించి పరిపాలనలో భాగస్వామ్యం చేసిన ఘనత సీఎం రేవంత్ రెడ్డికి దక్కుతుందన్నారు.
ఇదే కాకుండా మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందుతూ స్వయం సంవృద్ధిని సాధించాలనే లక్ష్యంతో వారికి అన్ని రంగాల్లోనూ ప్రాధాన్యత ఇస్తున్నట్టుగా చెప్పారు.
రాష్ట్రంలోని కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని తెలిపారు.

చర్లపల్లి ఆక్స్ఫర్డ్ గ్రామర్ స్కూల్ చైర్మన్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు గడ్డం యాదగిరి ఆధ్వర్యంలో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలకు రజితాపరమేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై అనంతరం ఆశ వర్కర్లకు, జిహెచ్ఎంసి సిబ్బందికి చీరలు పంపిణీ చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో
ప్రేమలతా అగర్వాల్ , డాక్టర్ ప్రియాంక, డాక్టర్ మౌనిక ఉపాధ్యాయురాలు సుప్రియ మహిళలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.