ముద్ర ప్రతినిధి, నిర్మల్: గురుకుల పాఠశాలల్లో బ్యాక్ లాగ్ సీట్ల భర్తీ కోసం నిర్వహించిన ఎంట్రన్స్ గురువారం ప్రశాంతంగా ముగిసింది. తెలంగాణ స్టేట్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ సొసైటీ వారి ఆధ్వర్యంలో నిర్మల్ పట్టణంలోని సోఫీ నగర్ లో నిర్వహించబడుతున్న బాలికల గురుకుల పాఠశాలలో గురువారం బ్యాక్ లాగ్ సీట్ల భర్తీకి ప్రవేశ పరీక్ష నిర్వహించారు.ఈ పరీక్షల నిర్వహణను నిర్మల్ జిల్లా ప్రభుత్వ పరీక్షల సహాయ కమిషనర్ ముడారపు పరమేశ్వర్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ జయంతి డానియల్, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.