- పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ , ఆర్మీ చీఫ్ మునీర్ కు ఎంఐఎం అధినేత చురకలు.
ముద్ర, తెలంగాణ బ్యూరో : పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ , ఆ దేశ ఆర్మీ చీఫ్ మునీర్.. తమ పంజాబ్ ప్రావిన్స్ లోగల రహీమ్ యార్ ఖాన్ ఎయిర్ బేస్ లో విమానాలను ల్యాండ్ చేయగలరా అని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ప్రశ్నించారు. అంతా బాగానే ఉంటే మీరు ఆ ఎయిర్ బేస్ లో ల్యాండ్ అవండి అని మంగళవారం ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్లో భాగంగా ఈ నెల 10న భారత బలగాలు పంజాబ్ ప్రావిన్స్ లోని రహీమ్ యార్ ఖాన్ ఎయిర్ బేస్ పై మిసైల్స్ తో దాడి చేసి, దానిని పూర్తిగా ధ్వంసం చేశాయి. అయితే పాక్ మాత్రం తమ ఎయిర్ బేస్ లపై ఎలాంటి దాడి జరగలేదని ముందు బుకాయించి.. అనంతరం దాడులు నిజమేనని ఒప్పుకుంది.ఈ నేపథ్యంలో ఓవైసీ పాక్ ను ఎద్దేవా చేస్తూ ఎక్స్ వేదికగా చురకలంటించారు.