- సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం.
ముద్ర ప్రతినిధి, జగిత్యాల: జగిత్యాల జిల్లాలోని కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానంలో ఈ నెల 20 నుండి 22 వరకు జరగనున్న పెద్ద హనుమాన్ జయంతి ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంతో కలిసి కొండగట్టులో బుధవారం సమీక్షి నిర్వహించారు.మల్యాల మండలంలోని కొండగట్టులో జరిగిన ఈ సమీక్ష సమావేశంలో కలెక్టర్ సత్య ప్రసాద్, ఎమ్మెల్యే తో పాటు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. హనుమాన్ జయంతి సందర్భంగా భక్తుల రాకపోకలు దృష్టిలో ఉంచుకుని లైటింగ్, చలవ పందిర్లు, తాగునీరు, మొబైల్ టాయిలెట్స్ వంటి సౌకర్యాలపై కలెక్టర్ అధికారులను ఆదేశించారు.అలాగే ఆలయ ప్రాంగణం, పరిసరాల్లో నిత్యం శుభ్రత, శానిటేషన్ నిర్వహణపై అధికారులకు సూచనలు ఇచ్చారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు చేయాలన్నారు.ఈ సమీక్ష అనంతరం కలెక్టర్, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఎస్పీ అశోక్ కుమార్ కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో దైవ దర్శనం చేసుకున్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, ఆర్డీవో మధుసూదన్, డి ఆర్ డి ఓ రఘువరన్ డిపిఒ మదన్ మోహన్, డీఎస్పీ రఘు చందర్, ఆలయ ఈవో, సీఐ, ఎస్ఐలు, తహసిల్దార్లు ఎంపీడీవోలు, మున్సిపల్ అధికారులు మిషన్ భగీరథ అధికారులు, తదితర సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
