Take a fresh look at your lifestyle.

నాగర్‌కర్నూల్ మండలంలో ఉచిత గాలికుంటు టీకాల శిబిరం నిర్వహణ

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్:

సోమవారం నాగర్‌కర్నూల్ మండలంలోని మల్కపూర్ మరియు పెద్దముద్దునూర్ గ్రామాల్లో పశువులకు ఉచిత గాలికుంటు టీకాల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మొత్తం 154 పశువులకు, 215 గేదెలకు టీకాలు వేశారు.

ఈ టీకా శిబిరాన్ని మండల పశువైద్య అధికారి డాక్టర్ కల్పన ఆధ్వర్యంలో నిర్వహించారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ పశువులను వ్యాధుల నుండి రక్షించుకోవాలని ఆమె సూచించారు.

ఈ కార్యక్రమంలో మల్కపూర్ గ్రామ సర్పంచ్ చేనమొని రాముడు, పెద్దముద్దునూర్ గ్రామ సర్పంచ్ ఎస్. ఊర్మిళమ్మ, ఉప సర్పంచ్‌తో పాటు పశువైద్య సిబ్బంది మాధ్య, వినయ్, శ్రీశైలం, సతీష్, మక్బూల్, పుల్లయ్య, పర్వతాలు, లింగస్వామి మరియు పశుపోషకులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.