- ట్రాఫిక్ ఎస్ఐ మల్లేష్.
ముద్ర, జగిత్యాల టౌన్: మైనర్ల వాహనాల డ్రైవింగ్ ను తల్లిదండ్రులు ప్రోత్సహించవద్దని ట్రాఫిక్ ఎస్ఐ మల్లేష్ అన్నారు. ఎస్పీ అశోక్ కుమార్ అదేశాల మేరకు పట్టణంలో న్యూ బస్టాండ్, టవర్ సర్కిల్ ప్రాంతాల్లో శుక్రవారం మైనర్ డ్రైవింగ్ పైన స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఇందులో భాగంగా 25 వాహనాలను సీజ్ చేసి, వారి తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. మైనర్ల డ్రైవింగ్ కు సహకరిస్తే వారి తల్లిదండ్రులపై చర్యలు చేపట్టాల్సి ఉంటుందన్నారు.
