మల్యాల,ముద్ర,విలేఖరి: మండలంలోని సర్వాపూర్-కొత్తపల్లె గ్రామాల ప్రదానం రహదారి వద్ద నిర్మిచనున్న డా. అంబేడ్కర్ విగ్రహ నిర్మాణానికి శనివారం చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం రూ” 20వేల నగదు సహాయం ఫోన్ పే ద్వారా పంపించగా మండల కాంగ్రెస్ సీనియర్ నాయకులు బత్తిని శ్రీనివాస్ గౌడ్ అంబేద్కర్ యువజన సంఘానికి అందజేశారు. ఈ కార్యక్రమంలో బత్తిని మల్లీశ్వరిశ్రీనివాస్ గౌడ్, ఆనంద్ రెడ్డి, తొట్ల చంద్రశేఖర్, మ్యాక లక్ష్మణ్, శనిగరపు తిరుపతి, నాగులపేట సంజీవ్, లక్ష్మణ్ చారి, బీవీ రమణ పటేల్, నక్క అనిల్, బండి రవి గౌడ్, బాలే శ్రీనివాస్, అంబేద్కర్ సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు.