Take a fresh look at your lifestyle.

స్వామివారిని చంద్రప్రభ వాహనం పై పక్షులకు దర్శనమిచ్చిన శ్రీరాముడు.. జల నారాయణ స్వామి వారికి మంగళహారతులు

ముద్ర ప్రతినిధి, భువనగిరి :
భూలోక వైకుంఠంగా విరాజిల్లుతున్న ప్రముఖ వైష్ణవ క్షేత్రమైన స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో వసంత నవరాత్రి మహోత్సవాల సందర్భంగా నిర్వహిస్తున్న శ్రీ రామాయణ పారాయణ క్రతు మహాయజ్ఞం రెండో రోజు అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రాతఃకాలంలో యాగశాలలో వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య శ్రీమద్రామాయణ పారాయణం, లోకక్షేమార్థం, భక్తుల సకలాభీష్ట సిద్ధి కోసం విశేష హోమ కార్యక్రమాలు ఆచారసంప్రదాయాల ప్రకారం నిర్వహించారు.
సాయంత్ర వేళలో స్వామివారిని అద్భుతంగా అలంకరించిన చంద్రప్రభ వాహనంపై ఆలయ ప్రాంగణంలో భక్తజనుల హర్షధ్వానాల మధ్య ఘనంగా ఊరేగింపుగా నిర్వహించారు. ఈ దివ్య వాహన సేవను దర్శించేందుకు అనేక మంది భక్తులు తరలివచ్చి, స్వామివారి కృపాకటాక్షాలను పొందారు.
ఈ మహోత్సవాలలో భక్తులు విశేషంగా పాల్గొని తమ భక్తిని చాటుకుంటూ, ఆధ్యాత్మిక ఆనందాన్ని అనుభవించారు. శనివారం సందర్భంగా జల నారాయణ స్వామి వారికి మంగళహారతులు సమర్పించారు.

Leave A Reply

Your email address will not be published.