అంగన్వాడీ కేంద్రాలు ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు వేగవంతంగా పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య
ముద్ర ప్రతినిధి,సంగారెడ్డి, :
జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలలు,సంగారెడ్డి, నారాయణఖేడ్ స్టేడియంలలో కొనసాగుతున్న మౌలిక వసతుల పనులను వేగంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య అధికారులను ఆదేశించారు.సోమవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్,యువజన సంక్షేమ & క్రీడాభివృద్ధి, విద్యాశాఖ,శిశు సంక్షేమ, విద్యుత్ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సంగారెడ్డి అంబేద్కర్ స్టేడియం,నారాయణఖేడ్ స్పోర్ట్స్ స్టేడియం రిపేరింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. సంగారెడ్డిలో నిర్మాణంలో ఉన్న స్విమ్మింగ్ పూల్ ప్రారంభానికి వెంటనే ఏర్పాట్లు చేయాలని పేర్కొన్నారు.అంగన్‌వాడీ కేంద్రాలకు విద్యుతీకరణ, చిన్నపాటి మరమ్మత్తులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే ఈజీఎస్ నిధులతో గ్రామాల్లో చేపట్టిన సీసీ రోడ్లు, పాఠశాలల కాంపౌండ్ వాల్స్, పాఠశాలల్లో మౌలిక వసతుల ఏర్పాటును వేగవంతం చేయాలని తెలిపారు. కేటాయించిన బడ్జెట్‌ను వినియోగించి మార్చి 31లోగా పనులు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. పూర్తయిన పనుల వివరాలను వెంటనే సమర్పించాలని అధికారులను ఆదేశించారు.ఈసమావేశంలో డీడబ్ల్యూఓ లలిత కుమారి, సీపీఓ బాలశౌరి,స్పోర్ట్స్ అథారిటీ అధికారి అఖిలేష్ రెడ్డి,అదనపు డీఆర్‌డీఓ బాలరాజ్,డీఈఓ వెంకటేశ్వర్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.