బోడుప్పల్, ముద్ర: తెలంగాణ రాష్ట్ర నకాష్ సంఘం 2026 వార్షిక క్యాలెండర్ ను ఆదివారం శ్రీ సోమవంశ క్షత్రియ నకాష్ కులస్తుల కులదేవత అయిన శ్రీ మాతా నిమిషాంబ దేవి ఆలయంలో ఆవిష్కరించారు. బీసీ డెడికేషన్ కమిషన్ ప్రత్యేక చైర్మన్ భూసాని వెంకటేశ్వరరావు తో పాటు, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కాంగ్రెస్ నాయకుడు తోటకూర వజ్రేష్ యాదవ్, ఆలయ చైర్మన్ కామరౌతు వినోద్ కుమార్, రాష్ట్ర నకాష్ సంఘం ప్రధాన కార్యదర్శి కొరిచెర్ల శ్రీనివాసరావు సంయుక్తంగా ఈ కేలండర్ ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమానికి బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షుడు, మాజీ కార్పొరేటర్ పోగుల నర్సింహారెడ్డి, మేడ్చల్ నియోజకవర్గం బి.బ్లాక్ ప్రధాన కార్యదర్శి కొత్త కిశోర్ గౌడ్, మాజీ కార్పొరేటర్లు చీరాల నరసింహ, దానగళ్ళ యాదగిరి గారు, కల్యాణ్ కుమార్, ఆలయ ప్రధాన కార్యదర్శులు కె.అశోక్ కుమార్, సంగు శ్రీనివాస్, ఆలయ ట్రస్ట్ ధర్మకర్తలు ఎమ్.శ్రీనివాస్ రావు, బి. హేమచందర్, ఎమ్. సాయి బాబా (శ్యామ్), రామగిరి శ్రీకాంత్, ఎన్.శ్రీకాంత్, వై. చంద్రశేఖర్, వెంకట్ రాజారావు, కె. ప్రవీణ్ కుమార్, డి.నరేష్, ఆలయ అర్చకులు చంద్రశేఖర్ శర్మ, ఉమాకాంత్ శర్మ పాల్గొన్నారు.