- విద్యారణ్యభారతి స్వామీజీ నిర్వహణ
బోడుప్పల్, ముద్ర : బోడుప్పల్ పెంటారెడ్డి కాలనీలో వేంచేసివున్న శ్రీ మాతా నిమిషాంబ ఆలయంలో నూతన అన్నదానభవనానికి గురువారం ద్వార ప్రతిష్ఠాపన కార్యక్రమం జరిగింది. శ్రీ శ్రీ శ్రీ జగద్గురు శంకరాచార్యులు, శ్రీ హంపీ విరూపాక్ష విద్యారణ్య సంస్థానాధీశ్వరులు, శ్రీ విద్యారణ్య భారతి స్వామీజి చేతులమీదుగా రెండు నూతన ద్వారాలు (చౌకోట్లు) కు పూజా కార్యక్రమాలు నిర్వహించి ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా స్వామి మాట్లాడుతూ సనాతన ధర్మం కోసం అందరూ పాటుపడాలని కోరారు. ఈ కార్యక్రమం లో ఆలయ చైర్మన్ కామరౌతు వినోద్ కుమార్ , ప్రధాన కార్యదర్శులు కె. అశోక్ కుమార్, ఎస్. శ్రీనివాస్,రాష్ట్ర నకాష్ సంఘం ప్రధాన కార్యదర్శి కొరిచెర్ల శ్రీనివాస్ రావు ట్రస్ట్ ధర్మకర్తలు బి. హేమచందర్, డి. నర్సింగ్ రావు, ఎమ్. సాయి బాబా (శ్యామ్), వై. చంద్రశేఖర్, ఎన్. శ్రీధర్ కె. ప్రవీణ్ కుమార్ ఆలయ అర్చకులు చంద్రశేఖర్ శర్మ, ఉమాకాంత్ శర్మ భక్తులు, బంధుమిత్రులు, ఆలయ ట్రస్ట్ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.