ముద్ర, శేరిలింగంపల్లి:
సైబరాబాద్ కమిషనర్ గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఐఏఎస్ సృజనను కాంగ్రెస్ పార్టీ శేరిలింగంపల్లి నియోజకవర్గం ఇంచార్జ్, టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.జగదీశ్వర్ గౌడ్ మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలో మంజూరైన అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేసేలా అధికారులను ఆదేశించాలని ఈ సందర్భంగా కోరారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ప్రతి డివిజన్ పరిధిలోని కాలనీ, బస్తీ అభివృద్ధికి కృషి చేస్తామని, తమ దృష్టికి వచ్చే ప్రతి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని కమిషనర్ హామీ ఇచ్చినట్టు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి హైదరాబాద్ నగరం పట్ల ప్రత్యేక శ్రద్ద కనబరుస్తున్నారని, అధికారులు సైతం సహకరించి నగర ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని కోరినట్టు తెలిపారు. వేసని కాలం సమీపిస్తున్నందున త్రాగునీటి కొరత, పారిశుద్ధ్యం తదితర నగర ప్రజల కనీస అవసరాలకు ఎటువంటి కొరత రాకుండా చర్యలు తీసుకోవాలని కోరినట్లు అనంతరం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.
Naresh is a Asst Editor and he is working with our organisation and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.