- మున్సిపాలిటీలో సీపీఎం నేతల పర్యటన
ముద్ర, ఇబ్రహీంపట్నం: అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు.ఇబ్రహీంపట్నం మున్సిపల్ కేంద్రంలో సీపీఎం నాయకులు పర్యటించి స్థానిక సమస్యల సర్వే నిర్వహించడం నిర్వహించారు.ఈ సందర్భంగా సీపీఎం మున్సిపల్ కన్వీనర్ చింతపట్ల ఎల్లేశ మాట్లాడుతూ ఉండడానికి ఇళ్లు లేక,రేషన్ కార్డులు లేక చాలామంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు,ఇందిరమ్మ ఇళ్లను కేటాయించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సీపీఎం ఇబ్రహీంపట్నం మున్సిపల్ కమిటీ సభ్యులు ఏర్పుల వీరేశం,చీమల ముసలయ్య, పార్టీ సభ్యులు హనుమంత శివ, మల్లెల నరసింహ,కామ్ శెట్టి బాలరాజ్ తదితరులు పాల్గొన్నారు.