- అతివేగంతో వాటర్ ట్యాంకర్ ను ఢీకొన్న బ్రీజా కారు
- కారులో ప్రయాణికులు సహా కార్మికుడి మృతి
ముద్ర, ఇబ్రహీంపట్నం: మొక్కలకు నీరు పోస్తున్న వాటర్ ట్యాంకర్ ను బ్రీజా కారు వెనుక నుంచి అతివేగంతో ఢీకొట్టిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందిన సంఘటన ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం చోటుచేసుకుంది.ఈ సంఘటనకు సంబంధించి ఆదిభట్ల పోలీసులు,ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం వివరాలు,బొంగులూరు నుండి తుక్కుగూడ వైపు ఔటర్ రింగ్ రోడ్డుపై మొక్కలకు నీళ్లు పెడుతున్న వాటర్ ట్యాంకర్ (ఏపీ28టీఈ3479)ను అతివేగంతో వచ్చిన బ్రీజా కారు (టీఎస్07జెఎం1210) రావిరాల సమీపంలోని వండర్లా ఎగ్జిట్ 13 వద్ద వెనుకనుండి బలంగా ఢీకొట్టింది.వాటర్ ట్యాంకర్ వెనకాల నిలబడిన కార్మికుడు పక్కకు ఎగిరిపడి అక్కడికక్కడే మృతి చెందాడు.బ్రీజా కారు ముందు భాగం వాటర్ ట్యాంకర్ కిందికి వెళ్లడంతో కారు డ్రైవర్ తో పాటు పక్కన ముందు కూర్చున్న వ్యక్తి కూడా అక్కడికక్కడే మృతి చెందాడు.ఔటర్ రింగ్ కార్మికుడుగా పనిచేస్తున్న వ్యక్తి కొంగర కాలన్ గ్రామానికి చెందిన చెన్నమోని రాములుగా గ్రామస్తులు గుర్తించారు.ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు.అతివేగమే ఈ ప్రమాదానికి కారణంగా పోలీసులు పేర్కొంటున్నారు.