Take a fresh look at your lifestyle.

రీల్స్‌తో మెదక్ పర్యాటక అందాలను విశ్వవ్యాప్తం చేయాలి కలెక్టర్ ప్రతిమా సింగ్

ముద్ర ప్రతినిధి, మెదక్:
ఇన్‌ఫ్లుయెన్సర్లు రీల్స్‌తో మెదక్ జిల్లా పర్యాటక అందాలను విశ్వవ్యాప్తం చేయాలని, లోకల్ టు గ్లోబల్‌గా మెదక్ జిల్లా ఘన కీర్తిని ప్రపంచానికి పరిచయం చేయాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ పిలుపునిచ్చారు.
గురువారం మెదక్ కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో ‘ ఇన్‌ఫ్లుయెన్సర్ రీల్స్ కాంపిటీషన్ పై ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
మెదక్ జిల్లా టూరిజంను ప్రపంచానికి పరిచయం చేసేందుకు నిర్వహిస్తున్న ఈ కాంపిటీషన్‌పై ఇన్‌ఫ్లుయెన్సర్లు, మీడియా ప్రతినిధులు, సోషల్ మీడియా హ్యాండ్లర్లతో కలెక్టర్ చర్చించారు.
రీల్స్ కాంపిటీషన్ విధివిధానాలు, రిజిస్ట్రేషన్ ప్రక్రియ, బహుమతుల వివరాలు తదితర అంశాలను వారికి వివరించారు. 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో పర్యాటక వారోత్సవాలలో భాగంగా మొదటిసారిగా వినూత్న పద్ధతిలో మెదక్ జిల్లాలోని అనేక పర్యాటక ప్రాంతాలకు బ్రాండింగ్ కలిగించే విధంగా ఇన్‌ఫ్లుయెన్సర్ రీల్స్ కాంపిటీషన్ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.
మెదక్ జిల్లా పర్యాటక ప్రాంతాలపై 4కే వీడియో క్వాలిటీతో రీల్స్ సమర్పించాల్సి ఉంటుందని, ఆసక్తి కలవారు తమ వీడియోలను ఈనెల 30 సాయంత్రం 5 గంటల వరకు జిల్లా పౌర సంబంధాల శాఖ కార్యాలయంలో సమర్పించవచ్చని, ఆన్‌లైన్ విధానంలో డీపీఆర్ఓ రాజు 9949922291, ఏపీఆర్ఓ బాబు 9701306838 నంబర్లకు వాట్సాప్ ద్వారా పంపించవచ్చని పేర్కొన్నారు.
పోటీలలో గెలుపొందిన వారికి జూన్ 2వ తేదీన నగదు ప్రోత్సాహకాలు అందించబడుతుందన్నారు.
మెదక్ జిల్లాలో ఆధ్యాత్మిక దేవాలయాలు, ప్రకృతి పర్యాటక కేంద్రాలు, జలపాతాలు, అభయారణ్య అందాలు, గిరిజన సంస్కృతి సాంప్రదాయాలు కలగలిసి అనేక పర్యాటక ప్రాంతాలు ప్రకృతి వైవిధ్యభరితంగా నెలవై ఉన్నాయని పేర్కొన్నారు.
జూన్ మాసం నుంచి పర్యాటక ప్రాంతాలకు ఎక్కువ సంఖ్యలో పర్యాటకులు వచ్చే అవకాశం ఉంటుందని, వారందరికీ మెదక్ జిల్లా సాదర ఆహ్వానం పలుకుతుందన్నారు. రీల్స్ కాంపిటీషన్ ద్వారా మెదక్ జిల్లా పర్యాటక ప్రాంతాలకు మంచి బ్రాండింగ్ వచ్చే విధంగా పూర్తి వివరాలతో, పర్యాటకులను ఆకట్టుకునే విధంగా రీల్స్‌ను రూపొందించాలన్నారు.
పర్యాటక దినోత్సవ టూరిస్ట్ గైడ్ పోస్టర్ను ఆవిష్కరించారు.
టూరిస్ట్ గైడ్ కోసం దరఖాస్తులు కోరుతున్నట్లు అట్టి దరఖాస్తులను నిబంధనలు మేరకు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ నగేష్, ప్రొఫెసర్ అర్జున్ రావు కుతాడి, డైరెక్టర్, పురావస్తు, మ్యూజియంల విభాగం డా. పి. నాగరాజు, ఎన్. నరసింగ్,
డిపిఆర్ఓ రామచంద్ర రాజు, యువజన క్రీడల నిర్వహణ అధికారి రమేష్, యూట్యూబర్స్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.