ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్:
నాగర్ కర్నూల్‌లో వెలసిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం (గోవింద క్షేత్రం)లో కలియుగ ప్రత్యక్ష దైవంగా భక్తుల కోరికలను తీర్చే శ్రీ వెంకటేశ్వర స్వామికి భక్తుల విశేష ఆదరణ లభిస్తోంది. ఈ నేపథ్యంలో ఆలయ అభివృద్ధి కార్యక్రమాలకు తమ వంతు సేవ చేయాలనే సంకల్పంతో ఏడుగురు ట్రస్ట్ సభ్యులు కమిట్మెంట్‌గా ముందుకు వచ్చారు.
ట్రస్ట్ సభ్యులుగా చేరిన దంపతులు:
సంబు అనిలా – పాండు,
నల్లవెల్లి రాజేందర్ రెడ్డి – మమత,
వంజ భాస్కర్ రెడ్డి – హేమలత,
పోరెడ్డి గోపాల్ రెడ్డి – శ్రీదేవి,
మర్యాద అనిల్ కుమార్ రెడ్డి – నీరజ,
అబ్బ గోవిందరెడ్డి – శ్రీలత,
చనుగొమ్ముల మధుసూదన్ రెడ్డి – రమ దంపతులు.
ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ, స్వామివారి సేవలో భాగస్వామ్యులైన ఈ ట్రస్ట్ సభ్యులు మరియు వారి కుటుంబ సభ్యులకు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కృపాకటాక్షాలు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. భక్తి భావంతో చేపట్టిన ఈ సేవా కార్యక్రమాలు ఆలయ అభివృద్ధికి దోహదపడతాయని తెలిపారు.