Take a fresh look at your lifestyle.

కట్టుదిట్టమైన భద్రత నడుమ ఈవీఎంలు భద్రం- జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి

ముద్ర, వనపర్తి:
జిల్లా కేంద్రంలో ఈవీఎంలు భద్రపరిచిన గోదాము కట్టుదిట్టమైన భద్రత నడుమ ఉందని జిల్లా కలెక్టర్‌ ఆదర్శ్ సురభి తెలిపారు. బుధవారం ఆర్డివో కార్యాలయం వెనక ఉన్న ఈవీఎం గోదాము ను నెలవారీ తనిఖీల్లో భాగంగా ఆర్డీవో సుబ్రహ్మణ్యంతో కలిసి పరిశీలించారు. ఈసీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా గోదాం వద్ద భద్రతా ఏర్పాట్లను తనిఖీ చేశారు. సీసీ కెమెరాల భద్రతా వ్యవస్థను పరిశీలించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ఈసీఐ మార్గదర్శకాలకు అను గుణంగా ఎప్పటికప్పుడు ఈవీఎం గోదామును తనిఖీ చేసి సమగ్ర నివేదికను సమర్పిస్తున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో బుధవారం నెలవారి తనిఖీలు చేసినట్లు వివరించారు. తహసిల్దార్ రమేష్ రెడ్డి, ఇతర అధికారులు తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.