Take a fresh look at your lifestyle.

సీఎం రేవంత్ ప్రతి నిర్ణయం ప్రజాకంటకం

  • హెచ్ సీయూ భూములు కాపాడేందుకు ప్రత్యక్ష కార్యచరణ.
  • బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్.

ముద్ర, తెలంగాణ బ్యూరో : పదిహేను నెలల రేవంత్ రెడ్డి పాలనలో ప్రతి నిర్ణయం ప్రజాకంటకంగా తయారైందని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ దుయ్యబట్టారు. హెచ్ సీయూ భూములను కాపాడుకునేందుకు పోరాడుతోన్న విద్యార్ధులపై పోలీసుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ఆందోళన చేపట్టిన విద్యార్ధులకు సంఘీభావం తెలుపుతున్నామని, అవసరమైతే ప్రత్యక్ష కార్యచరణకు దిగుతామన్నారు. ఈ మేరకు సోమవారం హైదరాబాద్‌లో మీడియాతో ఈటల రాజేందర్ మాట్లాడారు.. హెచ్ సీయూ తెలంగాణ రాష్ట్రానికే తలమానికమని, కొన్ని వేలమంది నిష్ణాతులను తీర్చిదిద్దిందన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం హెచ్ సీయూ భూములు అమ్మి అప్పులు కట్టాలని నీచమైన ప్రయత్నం చేస్తుందని ఆయన మండిపడ్డారు. హైదరాబాద్‌లో స్మశానవాటికలకు కూడా స్థలం దొరకని దుస్థితి వచ్చిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పార్కులకు సైతం స్థలాలు దొరకడం లేదని, మెత్తం కాంక్రీట్ జంగిల్‌గా మారుతుందన్నారు.

Leave A Reply

Your email address will not be published.