ముద్ర : కాప్రా
కాప్రా డివిజన్ పరిధిలోని అన్ని కాలనీలలో అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకుంటానని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి తెలిపారు.కాప్రా డివిజన్ పరిధిలోని ప్రవీణ్ ఎన్‌క్లేవ్‌లో రూ. 35 లక్షల నిధులతో నూతనంగా నిర్మించనున్న సీసీ రోడ్ పనులను ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ, కాలనీల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తాం అని, రోడ్డు నిర్మాణంతో స్థానిక ప్రజలకు రవాణా సౌకర్యాలు మరింత మెరుగుపడతాయని తెలిపారు. కాలనీ ప్రజలు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అభివృద్ధికి సహకరించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు బైరీ నవీన్ గౌడ్, కాలనీ అధ్యక్షురాలు లత, కార్యదర్శి మహేష్, రాఘవేందర్,పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు