Take a fresh look at your lifestyle.

ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి -కలెక్టర్ సిక్తా పట్నాయక్

 

ముద్ర, నారాయణ పేట :

ఫిబ్రవరి 25 వ తేదీ నుండి మార్చి 16వ తేదీ వరకు జరగనున్న ఇంటర్మీడియట్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఆమె కలెక్టర్ కార్యాలయం లో వి.సి. సమావేశ మందిరం లో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల నిర్వహణ విషయమై అదనపు కలెక్టర్ రెవెన్యూ శ్రీను సంబంధిత జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 15 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించటం జరుగుతుందని ఆమె తెలిపారు. మొదటి సంవత్సరం 4409, రెండవ సంవత్సరం 3783 మొత్తం 8192 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నట్లు తెలిపారు. పరీక్షల సందర్భంగా 144 వ సెక్షన్ విధించాలని…పరీక్షలు పూర్తయి వరకు అన్ని రకాల ఏర్పాట్లు సదుపాయాలను కల్పించాలన్నారు. ఆర్టీసీ అధికారులు గ్రామీణ ప్రాంతం నుండి అలాగే పట్టణ ప్రాంతాలలో సరైన బస్సులు నడపాలని, విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చూడాలని కోరారు.

Leave A Reply

Your email address will not be published.