Take a fresh look at your lifestyle.

రామాయంపేట మున్సిపల్ చైర్ పర్సన్ గా లావణ్య బాధ్యతల స్వీకరణ

ముద్ర ప్రతినిధి, మెదక్:
మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపల్ చైర్ పర్సన్ గా గజవాడ లావణ్య నాగరాజు గుప్తా శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. చైర్ పర్సన్ తో పాటు మున్సిపల్ నూతన పాలకవర్గం సభ్యులు పదవీ బాధ్యతలు చేపట్టారు. మున్సిపల్ కార్యాలయానికి వచ్చిన పాలకవర్గం సభ్యులకు అధికారులు ఘనస్వాగతం పలికారు. వేద పండితులు కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా లావణ్య మాట్లాడుతూ… ఎమ్మెల్యే రోహిత్ రావు, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు సహకారంతో రామాయంపేట మున్సిపాలిటీ అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తామని 12 వార్డులను సమానంగా అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్పర్సన్ పోచమ్మల నవనీత గణేష్, కౌన్సిలర్లు ప్రవీణ్, రవి నాయక్, నాల బైరం స్వప్న, చౌదరి చరిత, పుట్టి సందీప్, గజవాడ నాగరాజు గుప్తా, జంగంపల్లి శివశంకర్, దేవుని రంజిత్, మద్దెల మాధవి రమేష్, డాకి శ్యామల స్వామి, మున్సిపల్ మేనేజర్ రఘువరన్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.