Take a fresh look at your lifestyle.

శిథిలవస్తులో ఉన్న 6 పాఠశాల తరగతి గదులను తక్షణమే కూల్చివేయాలి

  • జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్.

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: జగిత్యాల జిల్లాధర్మపురి మండల కేంద్రంలో జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ విస్తృతంగా పర్యటించారు.ధర్మపురి ప్రభుత్వ ఉన్నంత పాఠశాలను పరిశీలించి, ప్రమాదకర శిథిలవస్తులో ఉన్నందున 6 గదులను తక్షణమే కూల్చివేయాలని మున్సిపల్ అధికారులకు, ఆర్ అండ్ బి,అధికారులను జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ఆదేశించారు. అనంతరం సానిటేషన్ అంశంపై అధికారులను డ్రైనేజీ, కాలువలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచి పరిశుభ్రత కోసం తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.గోదావరి నది లోతంటూ ప్రాంతాలలో రానున్న రోజుల్లో భారీ వర్షాలు అధికంగా కురిసే అవకాశం ఉండటంతో గోదావరి తీర లోతంటూ ప్రాంతాలను పరిశీలించి, లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం ఉండాలని ముందస్తు ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు.ధర్మపురి మున్సిపల్ ఆధ్వర్యంలో నిర్వహించిన వనమహోత్సవంలో పాల్గొని కలెక్టర్ సత్యప్రసాద్ మాట్లాడుతూ చెట్లు నాటడం ఎంత ముఖ్యమో వాటిని సంరక్షించడం మన అందరి బాధ్యత అని అన్నారు.ధర్మపురి కేంద్రంలో స్వయం ఉపాధితో అగరత్తులు తయారు చేస్తున్న వారిని కలసి, తయారీ విధానాల గురించి అడిగి తెలుసుకున్నారు. వారిని ప్రోత్సహిస్తూ మరింత పరిమాణంలో ఉత్పత్తి చేసి మార్కెట్‌లో నిలువబెట్టే విధంగా ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, ధర్మపురి ఇన్చార్జ్ తహసిల్దార్ సుమన్ , సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.