ముద్ర ప్రతినిధి, భువనగిరి:
భువనగిరి పట్టణంలోని స్థానిక జగదేవపూర్ చౌరస్తా వద్ద గల మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహమును ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఆదేశానుసారం చైర్ పర్సన్, తంగళ్ళపల్లి శ్రీవాణి రవికుమార్ క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ బీసీ సంఘాల నాయకులు చేసిన అభ్యర్థన మేరకు పరిశీలించడం జరిగిందన్నారు. మహనీయుల జయంతుల కార్యక్రమాలకు అన్ని విధాలుగా పూర్తి ఏర్పాట్లు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, బీసీ సంఘాల నాయకులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.