ముద్ర, తాండూర్:
వికారాబాద్ జిల్లా తాండూర్ నియోజకవర్గం లోని బషీరాబాద్ మండలం జీవన్గీగ్రామ మాజీ సర్పంచ్ నవనీత భర్త సుదర్శన్ రెడ్డి అనారోగ్యతో చికిత్స పొందుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి గారు పరామర్శించారు. సోమవారం మలక్ పేట్ లోని శ్రీహిత ఆసుపత్రిలో సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిని తండ్రి సీనియర్ నాయకుడు మాణిక్ రెడ్డి అలాగే వైద్యులు,ఆస్పత్రి ఎండి ఏలియాతో అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం కోరుకుంటున్న సుదర్శన్ రెడ్డికి మరింత మెరుగైన వైద్యం అందించాలని మహేందర్ రెడ్డి గారు సూచించారు సుదర్శన్ రెడ్డి త్వరలోనే కోలుకుంటాడని మాజీ సర్పంచ్ నవనీతకు, కుటుంబ సభ్యులకు మహేందర్ రెడ్డి గారు ధైర్యం చెప్పారు వారితో పాటు సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజవర్ధన్ రెడ్డి,నాగరాజు తదితరులు ఆయనతో ఉన్నారు.