108 బంగారు అష్టదళ పద్మ పుష్పాలతో పాదపద్మార్చన సేవ
ముద్ర ప్రతినిధి, భువనగిరి :
ఆదిమధ్యాంతరహితుడైన స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని బుధవారం సాయంత్రం మాడవీధులలో భక్తుల గోవింద నామస్మరణలతో మేళతాళ మృదంగ మంగళ ధ్వనుల మధ్య తిరువీధి ఉత్సవ సేవను ఘనంగా నిర్వహించారు. బుధవారం సందర్భంగా స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దివ్య పాదారవిందములకు ఒక వంద ఎనిమిది బంగారు అష్టదళ పద్మ పుష్పాలతో,శ్రీ స్వామివారికి అష్టోత్తర శతనామాలతో అష్టదళ పాదపద్మార్చన సేవ చేయడం జరిగింది. భక్తులు శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని ఆనంద పరవశులైనారు.