ముద్ర ప్రతినిధి, నిర్మల్:
తెలుగు నూతన సంవత్సర వేడుకలు నిర్మల్ జిల్లా వ్యాప్తంగా ఆనందోత్సాహాలతో నిర్వహించారు. పండగను పురస్కరించుకుని పలు గ్రామాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి రైతులు వ్యవసాయ పనులకు శ్రీకారం చుట్టారు. అలాగే పట్టణంలోని శివాజీ చౌక్ లో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఉగాది పండుగ నిర్వహించి ఉగాది పచ్చడి వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ అవినాష్ తో పాటు విశ్వహిందూ పరిషత్ సభ్యులు పాల్గొన్నారు. స్థానిక ఆర్కే ఫంక్షన్ హాలు లో ఉగాది ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు నిర్వహించి లోక కళ్యాణం కోసం యజ్ఞాన్ని నిర్వహించారు. అనంతరం టీవీ జబర్దస్త్ బృందం సభ్యులు సునామీ సుధాకర్, భాస్కర్, ప్రవీణ్, వినోదిని హాస్య ప్రదర్శనను తిలకించారు. పలు దేవాలయాల్లో ఉగాది పండుగ నిర్వహించి పంచాంగ శ్రవణం ఏర్పాటు చేశారు.
Naresh is a Asst Editor and he is working with our organisation and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.