Take a fresh look at your lifestyle.

ఆమెకు పట్టం కట్టడం లో కాంగ్రెస్ దే పై చేయి

  • జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు తాటిపర్తి విజయలక్ష్మి దేవేందర్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, జగిత్యాల : ఇంటికి దీపమైన ఇల్లాలు వెలుగుతోనే కుటుంబం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని, అలాంటి ఇల్లాలును అన్ని రంగాల్లో ముందు ఉంచుతూ అన్నింటిలో పట్టం కడుతూ పై చేయిగా నిలపడంలో కాంగ్రెస్ పార్టీ ముందుందని జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు తాటిపర్తి విజయలక్ష్మి దేవేందర్ రెడ్డి అన్నారు.ధర్మపురి మండల కేంద్రంలో మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలలో విజయలక్ష్మి పాల్గొని మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల ఆర్థిక స్వాలాంబానకు అవసరం అయిన అన్ని ప్రయత్నాలు చేస్తుందన్నారు.ప్రతి పథకం మహిళల పేరుమీద ఉండేలా పథకాలకు రూపకల్పన చేస్తూ,అందులో మహిళలను భాగస్వాములను చేస్తూ సాధికారత వైపు అడుగులు వేసేలా ప్రయత్నం చేస్తుందని గుర్తు చేశారు.మహిళా సంఘాల సభ్యులకు రు. 2 లక్షల రుణ భీమా, ప్రమాద భీమా కింద రూ. 10 లక్షలు అందించెందుకు కృషి చేస్తుందన్నారు.గ్రామీణ పేదరిక నిర్ములన సంస్థ ద్వారా 1 కోటి మంది మహిళలను కోటిశ్వరులను చేసేందుకు పథకం రూపొందించి 17 రకాల వ్యాపారాలకు సహాయం అందించి వ్యాపారవేత్తలుగా తీర్చిదిడేందుకు అడుగులు వేసిందని,అలాగే మహిళా సంఘాలకు సోలార్ విద్యుత్ ప్లాంట్ ల ఏర్పాటుకు అవకాశం కల్పించిందన్నారు.రానున్న అయిదేల్లాలో లక్ష కోట్ల రుణాలు మహిళలకు అందించడంతో పాటు,వడ్డీ ప్రభుత్వం భరించేలా పథకం ప్రారంభం కానుందన్నారు.వీటితో పాటుగా 150 అద్దె బస్సులను ఆర్టీసీకి మహిళా సంఘలా తరుపున అప్పగించిదని మరో 450 బస్సులు మహిళా సంఘాలకు అప్పగించేలా ప్రభుత్వం నేడు పథకం ప్రారంభించిందన్నారు.22 జిల్లాల్లో మహిళా సమైక్య భవనాలకు రూ. 5 కోట్ల నిర్మాణం వ్యయంతో రూ. 110 కోట్లు విడుదల చేసిందని,స్కూల్ యూనిఫామ్ లు సైతం స్వయం సహాయక బృందాల ఆధ్వర్యంలో కుట్టుటకు ప్రోత్సాహం ఇచ్చి, చరిత్రలో తొలిసారి బడులు ప్రారంభం అయిన రోజే యూనిఫామ్ లు పిల్లలకు అందించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వం కే దక్కిందన్నారు.ఈ కార్యక్రమం ద్వారా మహిళా సంఘల బృందలకు రూ. 80 కోట్ల లబ్ది చేకూరిందని తెలిపారు. శిల్పా రామం లో రూ. 9 కోట్లతో ఇందిరా మహిళా శక్తి బజార్ లను ఏర్పాటు చేయడంతో పాటు,టూరిస్ట్ ప్లేస్ లలో 100 మహిళా క్యాంటిన్ లను ఏర్పాటు చేసిందన్నారు.వీటితో పాటు ఉచిత బస్సు ప్రయాణం,ఉపాధి హామీ కూలీలకు ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లకు ఇటుకల తయారీకి మహిళా సంఘాలకు యూనిట్లు ఇలాంటి అనేక మహిళా సంక్షేమ,ప్రోత్సాహ కార్యక్రమాలు ప్రభుత్వం నిర్వహిస్తుండన్నారు.ప్రజాప్రభుత్వం లో ఆర్థిక స్వలంభన దిశగా మహిళలు అడుగులు వేసేలా కృషి చేస్తున్న తెలంగాణ ప్రభుత్వంకు,సీఎం రేవంత్ రెడ్డికి మహిళల పక్షాన,మహిళా కాంగ్రెస్ పక్షాన కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో శోభారాణి, నాగలక్ష్మి, సరిత, గోపిక, లావణ్య, మమత, జక్కు పద్మ, సంతోషీ, అరుణ, లత, రజిత, పద్మ, స్వప్న, రూప తదితరులు పార్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.