Take a fresh look at your lifestyle.

సహకార సంఘాలు ఆర్థిక పురోగతి సాధించాలి

  • డీసీసీబీ ఛైర్మన్ కొత్తకుర్మ సత్తయ్య.
  • తుర్కయంజాల్ లో జిల్లా సహకార సంఘం మహాజన సమావేశం.

ఇబ్రహీంపట్నం, ముద్ర విలేకరి: ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ఆర్థిక పురోగతి సాధించాలని, అందుకు స్థానిక అవసరాల రీత్యా అవకాశాలను కల్పించుకోవాలని డీసీసీబీ చైర్మన్ కొత్తకుర్మ సత్తయ్య అన్నారు. తుర్కయంజాల్ లోని ఓ హోటల్ లో ది హైదరాబాద్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ మహాజన సభ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన బ్యాంకు పరిపాలన నివేదిక, బ్యాంకు యొక్క జమ, ఖర్చు, లాభనష్టాలు, ఆస్తులు అప్పులను మహాజన సభ ముందు ప్రవేశపెట్టారు.అనంతరం మాట్లాడుతూ ఆర్థిక పురోగతే లక్ష్యంగా జిల్లాలోని పీఏసీఎస్‌లకు నాబార్డు నుంచి స్థానిక అవసరాలను బట్టి వ్యాపారాలు చేసుకోవడానికి రుణాలు మంజూరు చేస్తామని చెప్పారు. సంఘాలు ఆర్థిక పరిపుష్టి సాధించి రైతులకు అన్ని రకాలుగా సేవలు అందించాలని అన్నారు. పీఏసీఎస్‌లను ఆర్థికంగా బలోపేతం చేయడానికి అన్ని విధాలా సహకారం అందిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో సంఘం వైస్ చైర్మన్ ఎస్ రవీందర్ గౌడ్, సీఈఓ భాస్కర సుబ్రహ్మణ్యం, డైరెక్టర్లు పి అంజిరెడ్డి, డి చంద్రశేఖర్, బి సతీష్, ఎం బాల్ రెడ్డి, పి రామ్ రెడ్డి, పి లక్ష్మారెడ్డి, కె శ్యాంసుందర్ రెడ్డి, జి సైదా, పీజీవి రాణి, ప్రొఫెషనల్ డైరెక్టర్ వి గిరిధర్, డీసీసీబీ బ్యాంక్ జనరల్ మేనేజర్ లు ప్రభాకర్ రెడ్డి, ఫణి శ్రీరాం, డిప్యూటీ జనరల్ మేనేజర్ లు నాగంజలి, కిరణ్ కుమార్, సతీష్ రెడ్డి, వివిధ మండలాల సొసైటీ చైర్మన్ లు, బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.