Take a fresh look at your lifestyle.

కంటి శిబిరంలో 86 మందికి పరీక్షలు – 41 మందికి ఆపరేషన్లు

 

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్:

నాగర్ కర్నూల్: జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో గురువారం పాత కలెక్టరేట్ భవనం 102వ గదిలో నిర్వహించిన కంటి చికిత్స శిబిరం విజయవంతంగా జరిగినట్లు జిల్లా అంధత్వ నివారణ ప్రోగ్రాం అధికారి డాక్టర్ హెచ్. ప్రదీప్ తెలిపారు.

ఈ శిబిరానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 86 మందికి కంటి పరీక్షలు నిర్వహించగా, అందులో క్యాటరాక్ట్ (ముత్యబిందు) సమస్యతో బాధపడుతున్న 41 మందిని గుర్తించి ప్రత్యేక అంబులెన్స్ ద్వారా లయన్ రాంరెడ్డి కంటి ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.

రోగులకు ఆప్తాలమిక్ అధికారి కోట్ర బాలాజీ ప్రత్యేకంగా కంటి పరీక్షలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య సిబ్బంది వై. శ్రీనివాసులు, సుకుమార్ రెడ్డి, నరసింహ, చెన్నకేశవులు, ప్రకాష్, సురేష్, ఎన్. వెంకటేశ్వర చారి, సురేష్ చారి, కళ్యాణ్, సురేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.