కోరుట్ల, ముద్ర;
జగిత్యాల జిల్లా కోరుట్ల మండలంలోని అన్ని గ్రామాలలో సోమవారం రోజు రాత్రి అకాల వర్షాలతో రైతాంగాన్ని అతలాకుతలం చేశాయి. వ్యవసాయ అధికారి నాగమణి మంగళవారం రోజు రైతులతో కలిసి వర్షాలకు నష్టపోయిన పంటలను పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 260 ఎకరాలలో వరి, 45 ఎకరాలలో మొక్కజొన్న, 510 ఎకరాలలో మామిడి నష్టపోయినట్టుగా ప్రాథమిక నివేదిక జిల్లా స్థాయి అధికారులకు పంపడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారులు నరేష్ , రాఘవేంద్ర, ఫెమీన, శ్రీహరి, ఏకీన్పూర్ మరియు సంగెం గ్రామ రైతులు ఉన్నారు.