Take a fresh look at your lifestyle.

రాందేవరావు ఆస్పత్రి ఫ్లష్ ట్యాంక్‌లో నవజాత శిశువు మృతదేహం లభ్యం

​ముద్ర కూకట్‌పల్లి :

కూకట్‌పల్లి లోని రాందేవరావు ఆస్పత్రిలో విషాదకర ఘటన వెలుగుచూసింది. మంగళవారం ఆస్పత్రి గ్రౌండ్ ఫ్లోర్‌లోని ఓపీడీ మహిళా వాష్‌రూమ్ ఫ్లష్ ట్యాంక్‌లో ఒక నవజాత మగ శిశువు మృతదేహం లభ్యమైంది.
ఆస్పత్రిలో పనిచేసే నరసమ్మ అనే ఆయా వాష్‌రూమ్‌ను శుభ్రం చేయడానికి వెళ్లిన సమయంలో ఫ్లష్ ట్యాంక్‌లో శిశువు మృతదేహాన్ని గమనించి ఆస్పత్రి సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే స్పందించిన యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది.
​సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. గుర్తుతెలియని మహిళ ఆస్పత్రి వాష్‌రూమ్‌లోనే ప్రసవించి, శిశువును అక్కడ వదిలేసి వెళ్ళిందా లేదా మృతదేహాన్ని బయట నుంచి తెచ్చి ఇక్కడ పడవేసారా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.
​”నిందితులను గుర్తించేందుకు ఆస్పత్రిలోని సిసి ఫుటేజీని పరిశీలిస్తున్నాం. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చెసినా పోలీసు అధికారులు
​ప్రస్తుతం పోలీసులు ఆస్పత్రి రికార్డులను, గడిచిన 24 గంటల్లో ఓపీడీకి వచ్చిన గర్భిణీల వివరాలను సేకరిస్తున్నారు. శిశువు మృతికి గల కారణాలు పోస్టుమార్టం రిపోర్ట్ తర్వాతే తెలుస్తాయని అధికారులు వెల్లడించారు.

Leave A Reply

Your email address will not be published.