Take a fresh look at your lifestyle.

తుంగతుర్తి మండల కాంగ్రెస్ అధ్యక్ష రేసులో రేగటి రవి

 

–యువ నాయకత్వం వైపు అధిష్టానం మొగ్గు? 

– యువ కాంగ్రెస్ నాయకుడు, పారిశ్రామికవేత్తకు ప్రాధాన్యత

ముద్ర ,తుంగతుర్తి….

తుంగతుర్తి నియోజకవర్గానికి గుండెకాయ లాంటి తుంగతుర్తి మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి పోటీ తీవ్రస్థాయిలో కనిపిస్తుంది. అత్యంత ప్రతిష్టాత్మకమైన తుంగతుర్తి మండల కాంగ్రెస్ అధ్యక్ష పదవికి కాంగ్రెస్ పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు తీవ్రస్థాయిలో పోటీపడుతున్నారు .ముఖ్యంగా తుంగతుర్తి మండలంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తూ అందరిని కలుపుకుపోయే వ్యక్తి కోసం కాంగ్రెస్ అధిష్టానం అన్వేషిస్తుంది .ముఖ్యంగా బండ రామారం గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, మాజీ ఎంపీటీసీ, యువకుడు, పారిశ్రామికవేత్త రేగటి రవి పేరు కాంగ్రెస్ తుంగతుర్తి మండల పార్టీ అధ్యక్ష పదవి కోసం ప్రముఖంగా వినవస్తుంది. బండ రామారం గ్రామంతో పాటు మండలంలోని వివిధ గ్రామాలలో గుర్తింపు ఉన్న నాయకుడు రేగటి రవి కావడం అలాగే తుంగతుర్తి శాసనసభ్యునికి, మాజీ డిసిసి అధ్యక్షుడు రైతు కమిషన్ మెంబర్ చెవిటి వెంకన్న యాదవ్ కు సైతం సన్నిహితం కలిగిన వ్యక్తి అలాగే ప్రస్తుత డిసిసి అధ్యక్షులు గుడిపాటి నరసయ్య కు సైతం ఆది నుంచి తెలిసిన వ్యక్తిగా రేగటి రవికి మంచి పేరు ఉంది.

అలాగే తుంగతుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో ప్రత్యేక స్థానం ఉన్న ఏఐసీసీ మెంబర్ రామ్ రెడ్డి సర్వోత్తమ్ రెడ్డి ఆశీస్సులు కూడా రేగటి రవికి ఉంటాయని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది .కాగా తుంగతుర్తి మండల కాంగ్రెస్ అధ్యక్ష పదవి కోసం ప్రస్తుత మండల అధ్యక్షుడు దొంగరి గోవర్ధన్ సైతం తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది .ప్రధానంగా పోటీ వీరిద్దరి మధ్యనే ఉన్నట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. రేగటి రవి బండ రామారం గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను శాసనసభ్యులు ద్వారా మంజూరు చేయించి కొన్ని పనులు ఇప్పటికే పూర్తి చేశారు. ముఖ్యంగా బండ రామారావు గ్రామంలో గ్రామ పంచాయతీ భవనం 20 లక్షల రూపాయల వ్యయంతో పూర్తికాగా గ్రామంలో అంతర్గత రోడ్లను ఇప్పటికే సుమారు 15 లక్షల నిధులతో పూర్తి చేసినట్లు తెలుస్తోంది. మరో 10 లక్షల రూపాయల సిసి రోడ్లను మంజూరికి ప్రతిపాదనలు పంపినట్లు తెలుస్తోంది . రేగటి రవి కాంగ్రెస్ పార్టీ తుంగతుర్తి మండల అధ్యక్షుడిగా ఎంపికైనట్లయితే కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి అవకాశం ఉంటుందని అందరి నాయకులకు సన్నిహితంగా ఉండే రేగటి రవికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని రవి సన్నిహితులు చెబుతున్నారు. తుంగతుర్తి మండలం తోపాటు నియోజకవర్గ కేంద్రం కూడా తుంగతుర్తి కావడంతో బలమైన వ్యక్తి కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షునిగా ఉండాలని కాంగ్రెస్ వర్గాల మాటగా తెలుస్తుంది. ముఖ్యంగా అందరిని కలుపుకుపోతూ పార్టీని అభివృద్ధి పథంలో నడిపిస్తూ ఎలాంటి వర్గ విభేదాలకు తావు లేకుండా  ఉండాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది .మరి ఈ తీవ్రమైన పోటీలో తుంగతుర్తి మండల పార్టీ అధ్యక్ష పదవి రేగటి రవికి లభిస్తుందా? లేదా ?అనేది త్వరలోనే తెలుస్తుందని పలువురు కాంగ్రెస్ శ్రేణులు చెబుతున్నాయి. మండలంలో మెజార్టీ కాంగ్రెస్ నాయకులు సైతం రేగటి రవి కి అండగా నిలుస్తున్నట్లు సమాచారం. ఏది ఏమైనా తుంగతుర్తి మండల కాంగ్రెస్ అధ్యక్ష పదవి పోటీ తీవ్రంగా ఉన్న నేపథ్యంలో అధినాయకత్వం ఎవరి వైపు మొగ్గు చూపుతుందో వేచి చూడాల్సి ఉంది.

Leave A Reply

Your email address will not be published.